Begin typing your search above and press return to search.

రంగస్థలం నుంచి కదనరంగానికి

By:  Tupaki Desk   |   22 Sep 2017 7:25 AM GMT
రంగస్థలం నుంచి కదనరంగానికి
X
ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల అభిమానంతో పాటు భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. తన 151వ సినిమాగా రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంపిక చేసుకున్నాడు. ‘సైరా.. నరసింహారెడ్డి’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు చిరంజీవి తనయుడు రామ్ చరణే నిర్మాత. ‘సైరా’ సినిమా ఓ రేంజిలో తీయాలని ముందే డిసైడైపోయిన రామ్ చరణ్ ఈ సినిమాకు కాస్టింగ్ నుంచి టెక్నీషియన్స్ వరకు టాప్ లో ఉన్నవాళ్లనే ఎంచుకున్నాడు. దీంతో ప్రారంభానికి ముందే సైరా పై విపరీతమైన క్రేజ్ వచ్చింది.

సినిమా షూటింగ్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే ముందు అనుకున్న టెక్నీషియన్లలో ఒకరు తప్పుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ సైరా సినిమాకు పనిచేస్తాడని ముందుగా ప్రకటించినా ఇప్పుడు ఆయన ఈ సినిమా చేయబోవడం లేదనేది చెన్నై ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. రవివర్మన్ ఇంతకుముందు అపరిచితుడు - దశావతారం లాంటి హిట్ సినిమాలతో తన పనితనం నిరూపించుకున్నవాడే. కానీ ముందు అనుకున్న కొన్ని కమిట్ మెంట్ల వల్ల రవివర్మన్ ఈ సినిమా మేకింగ్ నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది. దీంతో రవివర్మన్ ప్లేసులో సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలును తీసుకున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి గత సినిమా ఖైదీ నెంబర్ 150కి రత్నవేలుయే సినిమాటోగ్రాఫర్ గా చేశాడు. దీంతోపాటు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985కి కూడా ఆయనే సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. రత్నవేలు టాలెంట్ పై గట్టి నమ్మకంతో ఆయనకు రామ్ చరణ్ సైరా ఛాన్స్ ఇచ్చాడు. క్రేజీ ప్రాజెక్టు కావడంతో రత్నవేలు కూడా ఈ ఆఫర్ ను యాక్సెప్ట్ చేసి పనిలోకి దిగిపోయాడని మెగా క్యాంపులోని వారు చెబుతున్నారు. సైరా భారీ ప్రాజెక్టు కావడంతో ఈ మాత్రం మార్పులు సహజమే అనుకోవాలి మరి. చూద్దాం.. ఇంకెన్ని ముందుముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో..