Begin typing your search above and press return to search.

కెమెరామ్యాన్ అంటే నీళ్లలా కలిసిపోవాలి

By:  Tupaki Desk   |   10 April 2018 11:30 PM GMT
కెమెరామ్యాన్ అంటే నీళ్లలా కలిసిపోవాలి
X
సినిమాటోగ్రాఫర్ అంటే ఒకప్పుడు పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ సినిమా అందంగా వచ్చింది అంటే దానికి ముఖ్యం కారణం అతనే. కెమెరా పనితనం కరెక్ట్ గా ఉంటేనే సినిమాలో ఒక భావం ఈజీగా అర్ధమవుతుంది. గత కొంత కాలంగా సౌత్ లో అగ్ర దర్శకుల దగ్గర వర్క్ చేస్తోన్న రత్నవేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సినిమా ఒప్పుకున్నారంటే మరో సినిమా జోలికి ఆయన వెళ్లారు. మొదట ఒప్పుకున్నా సినిమా అయిపోయిన తరువాతే మరో సినిమా అంటారు.

సేతు - రోబో అలాగే అపరిచితుడు - 1 నేనొక్కడినే వంటి డిఫెరెంట్ సినిమాలకు.. అలాగే ఆర్య - కుమారి 21F లాంటి రొమాంటిక్ ప్రేమకథా చిత్రాలకు కూడా తనదైన శైలిలో ఫోటోగ్రఫీని అందించారు. సుకుమార్ తో ఆయనకున్న రిలేషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. 100% లవ్ - నాన్నకు ప్రేమతో తప్పా ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు రత్నవేలు కెమెరామెన్ గా వర్క్ చేశారు. 14 ఏళ్ల ఫ్రెడ్షిప్ లో ఏనాడూ వారి బంధం చెదరలేదు. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అలందుకుంటుందో తెలిసిందే.

ఎక్కువగా రత్నవేలు పనితనం గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ కెమెరామెన్ మధ్య భార్య భర్తల తరహాలో అర్ధం చేసుకునేల ఒక రిలేషన్ ఉంటేనే సినిమా చాలా బాగా తెరకెక్కుతోందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అంతే కాకుండా రంగస్థలం సినిమాకు ముందు సుకుమార్ తో చాలాసార్లు కలవడం జరిగిందని అలా జరిగితే సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వస్తుందని చెబుతూ.. ఎవ్వరితో కలిసినా నా సినిమా బావుండేలా చూసుకుంటాను. కెమెరామెన్ నీళ్లలా కలిసిపోవాలి అనే ఆలోచన తనదని రత్నవేలు వివరించారు.