Begin typing your search above and press return to search.

రావణాసుర 'A' గోల.. కావాలనే!

By:  Tupaki Desk   |   4 April 2023 5:43 PM GMT
రావణాసుర A గోల.. కావాలనే!
X
సాధారణంగా దర్శక నిర్మాతలు తమ సినిమాకి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రాకూడదని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ వస్తే కనుక ఫ్యామిలీలు తమ సినిమా చూసేందుకు రారేమోనని వారు భయపడుతూ ఉంటారు. అయితే రవితేజ హీరోగా రూపొందించిన రావణాసుర దర్శక నిర్మాతలు మాత్రం ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు.

అంతేకాక సెన్సార్ సమయంలో అనేక కట్స్ కూడా సినిమాకి చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ స్క్రీనింగ్ పూర్తయింది. సర్టిఫికెట్ జారీ చేయాలంటే పాతిక కట్స్ చెప్పారు సెన్సార్ అధికారులు. అయితే సినీ దర్శక నిర్మాతలు మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్లేదు. యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా పర్లేదు... ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కట్ చేస్తే మా సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అలాగే సెన్సార్ చెప్పిన కట్స్ గనక కట్ చేస్తే సినిమాలో దాదాపు 20 నిమిషాల రన్ టైం కూడా కట్ అయిపోతుందని వారు సెన్సార్ అధికారులకు చెప్పి చివరికి ఆ కట్స్ లేకుండా ఏ సర్టిఫికెట్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లకు A సర్టిఫికెట్ రావడం అంటే అది పెద్ద వింత ఏమీ కాదు.. ఎందుకంటే వెన్నులో చలి పుట్టించే కొన్ని ఆసక్తికరమైన సీన్లు ఇలాంటి సినిమాల్లోనే ఉంటాయి.

ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల మీద ఈ సినిమా సంయుక్తంగా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదలకు ఇంకా రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

నిర్మాతలు ఒకపక్క... డైరెక్టర్ మరోపక్క... హీరో అలాగే హీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద మంచి ఆసక్తి ఏర్పరిచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో రవితేజ మరో హిట్ కొడతాడని నమ్మకంతో ఉన్నారు ఆయన అభిమానులు. చూడాలి మరి ఏమవుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.