Begin typing your search above and press return to search.
40లోనూ సెగలు పుట్టిస్తోంది
By: Tupaki Desk | 12 April 2015 12:11 PM IST16 ప్రాయం పడుచు పిల్ల కాదు. ఇంకా పెళ్లి కాని కన్నె పిల్ల కానే కాదు. పిల్లలున్నారు. భర్త ఉన్నాడు. సంసార బంధనంలో మునిగి తేలుతోంది. అయినా ఇప్పటికీ తరగని అందంతో మతుల్ సుతుల్ తప్పేలా చేస్తోంది. 40 వయసులోనూ సెగలు పుట్టిస్తోంది. అసలింతకీ ఎవరీవిడ? అనే సందేహం మిమ్మల్ని నిలవనీయడం లేదు కదూ!
అవును ఈ అందం పేరు రవీనా టాండన్. బాలయ్య బాబు సరసన బంగారు బుల్లోడు చిత్రంలో నటించింది అమ్మడు. ఆ రోజుల్లోనే తెలుగు యువత గుండెల్లో గుబులు పుట్టించిన ఈ అమ్మడు బాలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్. రవీనా సినిమాని వదిలి సంసార జీవనంలో అడుగుపెట్టాక బుల్లితెరపై అడపాదడపా కనిపించింది. బాలల చలనచిత్రోల్సవాల కమిటీకి అధ్యక్షురాలు (2002-2005)గా పనిచేసింది. ఇటీవలే పూరి జగన్నాథ్ బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రంలోనూ ఈ అమ్మడు నటించింది. లేటు వయసులోనూ ఘాటుగా వయ్యారాలు ఒలకబోసింది. ఈ స్టింటు ఉంది కాబట్టే అమ్మడి వెంట ఇప్పటికీ వాణిజ్య ప్రకటనల కంపెనీలు వెంటపడుతూనే ఉన్నాయి.
ఆంటీ అనే భేషజానికి పోకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. ప్రస్తుతం రవీన ఓ చాకొలెట్ యాడ్‌తో బుల్లితెరపై సందడి చేస్తోంది. మంచు కొండల్లో చెలికాడిపైకి మంచు ముద్దల్ని జల్లేస్తూ సరసమాడే పదహారు ప్రాయం పాపాయిలా కనిపించింది ఇందులో. నిజంగానే ఇది పెద్ద షాక్.