Begin typing your search above and press return to search.

తప్పు మ్యాగీదైతే మాపై కేసులా?

By:  Tupaki Desk   |   29 Jun 2015 7:08 AM GMT
తప్పు మ్యాగీదైతే మాపై కేసులా?
X
మ్యాగీలో ప్రమాదకర రసాయనాలున్నాయని ఆరోపణలు రావడం.. దానిపై నిషేధం విధించడం వరకు ఓకే.. కానీ ఆ ఉత్పత్తులకు ప్రచారం చేసినందుకు సినిమా వాళ్లపై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌. మ్యాగీని మార్కెట్లోకి అనుమతించిందే ప్రభుత్వం అని.. అలాంటపుడు సినిమా వాళ్లను దీనికి ఎలా బాధ్యుల్ని చేస్తారని ఆమె ప్రశ్నిస్తోంది.

''ఓ ప్రాడక్ట్‌ క్వాలిటీ ఎలా ఉందో నిర్ణయించి.. దాన్ని మార్కెట్లోకి అనుమతించేది ప్రభుత్వమే. కొన్ని ఆహార పదార్థాలను ప్రభుత్వమే ఆమోదించినపుడు మేం వాటికి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తే తప్పేంటి? మ్యాగీ తప్పు చేస్తే ఆ బ్రాండుకు ప్రచారం చేసిన మా సినిమా వాళ్ల మీద కేసులు వేయడం సమంజసం కాదు. దాదాపు 30 ఏళ్లుగా మ్యాగీ మార్కెట్లో ఉంది. మరి ఇన్నేళ్లుగా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఆమోదించింది కాబట్టే మేం ప్రచారం చేశాం. తీరా ఇప్పుడు హఠాత్తుగా నిద్రలేచి ఆ ఉత్పత్తులు ప్రమాదకరం అంటూ మామీద పడితే మేమేం చేస్తాం. నేను ఏనాడూ సిగరెట్లు, మద్యం లాంటి అనారోగ్యకరమైన ఉత్పత్తులకు ప్రచారం చేయలేదు. ఈ మధ్య ఓ యోగర్ట్‌ ఉత్పత్తికి ప్రచారం కోసం అడిగారు. మ్యాగీ అనుభవం దృష్టిలో పెట్టుకుని దాని క్వాలిటీ గురించి తెలుసుకున్నా. ల్యాబ్‌ రిపోర్ట్‌ చూశాకే దాని ఎండార్స్‌మెంట్‌పై సంతకం చేస్తా'' అని చెప్పింది రవీనా.