Begin typing your search above and press return to search.

రవీనాకు బాహుబలికి అదే లింక్

By:  Tupaki Desk   |   3 Oct 2017 11:21 AM IST
రవీనాకు బాహుబలికి అదే లింక్
X
ఎక్కడ చూసినా కూడా బాహుబలి టీమ్ ను కలవడానికి సెలబ్రిటీలు ఎగబడుతున్నారు అనే టాపిక్ తెగ వినిపిస్తోంది. అయతే మొన్ననే సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా బాహుబలి ప్రభాస్.. భల్లాలదేవ రానా దగ్గుబాటి.. అనుష్క.. మరియు కె రాఘవేంద్రరావు కోడలు కనికా తిల్లాన్ తో కలసి ఒక సెల్ఫీ దిగేసి పెట్టేసింది. అయితే ఈ సెల్ఫీ వెనుక చాలా పెద్ద స్టోరీయే ఉంది.

ఏదో సరదాగా హైదరాబాద్ వచ్చేసి బాహుబలి టీమ్ ను కలసి ఒక పార్టీ చేసుకుని ఆ ఫోటోలను నెట్లో పెట్టలేదండోయ్. నిజానికి బాహుబలి సినిమా పార్ట్ 1 అండ్ 2 హిందీలో అంత గ్రాండుగా రిలీజ్ అవ్వడానికి కారణం రవీనా టాండన్ భర్త అనిల్ తడాని. ఇతగాడు ఒక బడా డిస్ర్టిబ్యూటర్. అప్పట్లో కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు. ఎఎ ఫిలింస్ అంటూ ఇతగాడే కరణ్‌ జోహార్ తో కలసి బాహుబలిని కొనేశాడు. కరణ్ కేవలం పబ్లిసిటీ చేస్తే.. భారీ సంఖ్యలో ధియేటర్లను అమర్చింది ఇతనే. పైగా బోలెడన్ని లాభాలను కూడా అర్జించాడు.

అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు బాహబలి టీమ్ అందరికీ ఒక కత్తిని బహుకరించాడు అనిల్. ఆ సందర్భంగా కె.రాఘవేంద్రరావు ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరిగింది. రాజమౌళి శ్రీలంకలో ఉన్నాడు కాబట్టి.. తక్కిన టీమ్ అంతా అక్కడికి హాజరు అయ్యారు. అదన్నమాట.. రవీనాకు ఈ బాహుబలి టీమ్ తో ఉన్న సెల్ఫీ తాలూకు లింక్. అర్ధమైందా?