Begin typing your search above and press return to search.
రక్తపు మడుగులో రవీనా!!
By: Tupaki Desk | 13 Jan 2017 10:49 AM ISTఓ జనరేషన్ వెనక బాలీవుడ్ ని అలరించిన బ్యూటీస్ లో రవీనా టాండన్ ఒకరు. ఈ మధ్య సినిమాలు తగ్గించేసింది కానీ.. ఈ భామకి ఇప్పటికీ క్రేజ్ విపరీతంగానే ఉంటుంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం ది మదర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మదర్ చిత్రంలోంచి ఓ ఫోటోని విడుదల చేసింది యూనిట్. కళ్ల నిండా ధారలుగా కారుతున్న నీళ్లు.. చెరిగిపోయిన జుట్టు.. రక్తం ఓడుతున్న తల.. పెదాల నుంచి ధారలుగా కారుతున్న రక్తం.. చూడగానే రక్తపు మడుగులో రవీనా టాండన్ ఏంటి అనిపించి.. కొంత భయపెట్టేసేలా ఉంది ఫోటో. ది మదర్ మూవీలో రవీనా టాండన్ తల్లి పాత్రలో నటించనుండగా.. లైంగిక వేధింపులకు గురయ్యే మహిళల తరపున పోరాటం చేసే పాత్రలో ఈమె నటిస్తోంది.
ఈమె పోరాటానికి సంబంధించి ఇది దుండగుల రియాక్షన్ అనుకోవచ్చు. మహిళలకు వంద శాతం న్యాయం జరగాల్సిందే అంటూ పోరాటం చేసే పాత్రలో కనిపించనుంది రవీనా టాండన్. సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యపై తెరకెక్కుతున్న చిత్రం కావడంతో.. ఈ రోల్ చేస్తోందీ సీనియర్ భామ. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్.. ఈ మదర్ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/