Begin typing your search above and press return to search.
నాని ఇంకో విలన్ ని తెస్తున్నాడు
By: Tupaki Desk | 5 Feb 2018 4:15 AM GMTతెలుగు తెరపై హీరోలకు కొరతేం లేదు కానీ సరైన విలన్ల కొరత ఉందని అప్పుడప్పుడు దర్శక నిర్మాతలు అంటూ ఉంటారు. దానికి తగ్గట్టు కొత్త విలన్లను వెండితెరకు పరిచయం చేస్తూనే ఉన్నా వాళ్లలో ప్రేక్షకులను మెప్పించే వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అందుకేనేమో నాచురల్ స్టార్ నాని వరసగా రెండో సినిమాలోనూ కొత్త విలన్ ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు.
నాని లేటెస్ట్ మూవీ ఎంసీఏ లో విజయ్ వర్మను విలన్ గా టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్న కృష్ణార్జున యుద్ధం మూవీ కోసం ఢిల్లీ నుంచి రవి అవనా అనే విలన్ ను తీసుకొస్తున్నారు. చాలామంది లాగే మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చాడు. ఇంతకుముందు కళ్యాణ్ రామ్ తో పూరిజగన్నాథ్ తీసిన ఇజం సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు. మెయిన్ విలన్ గా నటించడం మాత్రం రవి అవనాకు ఇదే మొదటిసారి. ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటంతో తనకు చక్కటి పేరు తెస్తుందని ఈ యంగ్ విలన్ ఆశపడుతున్నాడు.
ఈ సినిమాలో తన పాత్ర తనే డబ్బింగ్ చెప్పుకొంటున్నాడు. ఎందుకంటే ముంబయి బేస్ గా నేరాలు సాగించే వ్యక్తిగా ఇందులో రవి కనింపించనున్నాడు. ఈ పాత్ర డైలాగులు చాలావరకు హిందీలోనే ఉంటాయి. ఏదో ఒకటి రెండు డైలాగులు మాత్రమే తెలుగులో ఉంటాయి. అదేదో కాస్త కష్టపడి అతడితోనే చెప్పించేస్తే మరింత డిఫరెంట్ గా ఉంటుందని భావించారట. దాంతో తెలుగు నేర్చుకునే పనిలో పడ్డాడీ ఢిల్లీ కుర్రాడు.