Begin typing your search above and press return to search.

'ఆవిరి' ఐడియా అమ్రాపాలి వల్లే వచ్చిందట

By:  Tupaki Desk   |   30 Oct 2019 11:00 PM IST
ఆవిరి ఐడియా అమ్రాపాలి వల్లే వచ్చిందట
X
విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు. ఈయన చేసినవి కొన్ని సినిమాలే అయినా చాలా విలక్షణంగా ఉండటంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఈయన గత చిత్రం అదుగో కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. పంది పిల్లతో అదుగో సినిమా చేసిన రవిబాబు ఆ చిత్రంతో నిరాశ పర్చాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో తనకు గతంలో సక్సెస్‌ లు తెచ్చి పెట్టిన హర్రర్‌ నేపథ్యంలోనే మరో సినిమాను రూపొందించాడు.

'ఆవిరి' అనే టైటిల్‌ తో రూపొందిన ఈ చిత్రంలో విభిన్నమైన కథాంశం ఉంటుందని రవిబాబు చెబుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కలెక్టర్‌ అమ్రపాలి కలెక్టరేట్‌ లో దెయ్యం ఉంది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే తనకు ఈ సినిమాను చేయాలనే ఆలోచన వచ్చిందంటూ రవిబాబు చెప్పుకొచ్చాడు. ఆవిరి సినిమా ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌ చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమా కూడా బాగుంటుందనే టాక్‌ సోషల్‌ మీడియాలో సాగుతోంది.

రవిబాబు ఈ చిత్రంను చాలా వరకు కొత్త వారితో తీశాడట. అదుగో సినిమా కోసం చాలా ఎక్కువ రోజులు కష్టపడ్డానని.. ఆ సమయంలో వచ్చిన సాహో సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాల ఆఫర్‌ లను వదులుకున్నాను అంటూ రవిబాబు చెప్పుకొచ్చాడు. ఇకపై నటుడిగా కూడా బిజీగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. దర్శకత్వం కొనసాగిస్తూ ఎక్కువగా నటనపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి రవిబాబు వచ్చాడట.