Begin typing your search above and press return to search.

అదిగో లేదు.. ఇదిగో ఇంకో సినిమా

By:  Tupaki Desk   |   19 Feb 2018 10:01 AM IST
అదిగో లేదు.. ఇదిగో ఇంకో సినిమా
X
రవిబాబు దర్శకత్వం చేసే సినిమాలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. పరిమిత బడ్జెట్ తో.. కొత్త కాన్సెప్టులతో ఆయన తీసిన సినిమాలు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అవును సినిమా తరవాత కమర్షియల్ హిట్ అన్నది రవిబాబు అందకుండా పోయింది. ఓ పందిపిల్లతో అదిగో అనే ప్రయోగాత్మక సినిమా తీసినా అది రిలీజుకే నోచుకోలేదు.

యంగ్ హీరో రాజ్ తరుణ్ తో రవిబాబు సినిమా తీయడానికి గతేడాది రెడీ అయ్యాడు. ప్రముఖ బ్యానర్ వైజయంతి మూవీస్ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా నిర్మించడానికి సిద్దమైంది. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే అటకెక్కింది. చాలారోజులుగా ఈ సినిమాకు సంబంధించి చడీచప్పుడూ లేదు. దీంతో ఈ సినిమా ఇక పట్టాలెక్కేది కాదని అంతా అనేసుకున్నారు. తాజాగా ఈ మూవీని అటకమీద నుంచి దింపి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ లో లేటెస్ట్ టాక్. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టబోతున్నారు.

ఈ ఏడాది రంగులరాట్నంతో ఎదురుదెబ్బ తిన్న రాజ్ తరుణ్ తన ఆశలన్నీ తరవాత మూవీ రాజుగాడుపైనే పెట్టుకున్నాడు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ కామెడీ ఎంటర్ టెయినర్ లో అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. రాజుగాడు సినిమా పనులు పూర్తయ్యాక రాజ్ తరుణ్ రవిబాబు డైరెక్షన్ లో వచ్చే మూవీ షూటింగ్ కు సమయం కేటాయించనున్నాడు.