Begin typing your search above and press return to search.
ఆ పంది కోసం ఎంత ఖర్చు పెట్టారంటే...
By: Tupaki Desk | 27 Jun 2016 7:46 AM GMTప్రపంచాన్ని మరోకోణం లోంచి చూడ్డం, చూపించడం రవిబాబు స్పెషాలిటీ. సాధారణంగా అందరూ పంది అంటే ఛీఛీ అంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం ఓ పందిపిల్లను హీరో చేసేశాడు. ఒక పంది పిల్లను ని మెయిన్ రోల్ లో చూపిస్తూ.. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా ఈ సినిమా తీసి.. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చేశాడీ డైరెక్టర్.
నిజమైన పందిపిల్లతోనే కొన్ని సీన్లు తీయగా.. హాలీవుడ్ నుచి యానిమాట్రిక్స్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని.. దాని ఆధారంగా మరిన్ని సీన్స్ క్రియేట్ చేశారు. మొత్తం మీద ఔట్ పుట్ అదిరిపోనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పంది పిల్లను ఎక్కడి నుండి తెచ్చాడో తెలుసా? ఏదో సరదాగా మన హైదరాబాద్ సందుల్లో ఎక్కడో దొరికిన పంది పిల్లతో సినిమా చేయలేదండోయ్. ఏకంగా ఆస్ర్టేలియా నుండి 10 లక్షలు ఖర్చుపెట్టి ఈ పందిపిల్లను ఇంపోర్టు చేసుకున్నాడు రవిబాబు. ముఖ్యంగా పింక్ కలర్ లో కనిపిస్తూ.. పైగా ముద్దుగా అనిపిస్తూ.. కేవలం వెజిటేరియన్ ఫుడ్ తినే పంది పిల్లను వెతికిపట్టుకొని కొనుకున్నారట. దీనిని మెయిన్టయిన్ చేయాలన్నీ కూడా చాలా ఖర్చవుతుందని తెలుస్తోంది.
కాకపోతే మరీ పంది పిల్ల అనేసరికి.. కార్టూన్ మూవీ అయితే ఓకె కాని.. ఇలా లైవ్ యాక్షన్ సినిమా అంటే మాత్రం చాలామందికి అంత తేలికగా డైజెస్ట్ అవ్వకపోవచ్చు. చూద్దాం మన క్రియేటివ్ డైరక్టర్ ఏం చేస్తాడో!!