Begin typing your search above and press return to search.
మరి రవిబాబు ప్రశ్నకు ఆన్సర్ ఉందా?
By: Tupaki Desk | 4 July 2016 5:30 PM GMTమనకున్న చాలామంది డైరక్టర్లలో.. కేవలం అతి తక్కువ మందికే టెక్నికల్ బ్రిలియన్స్ అనేది ఎక్కువగా ఉంది. అలాంటి వారందరిలోకీ టాప్ పొజిషన్ లో ఈజీగా వచ్చే దర్శకుడు ఎవరూ అంటే మాత్రం రవిబాబు పేరునే మనం చెప్పుకోవాలి. చాలా క్రియేటివ్ అంట్ టెక్నీకల్లీ మనోడు చాలా అడ్వాన్సుడ్ కూడా. ఇదంతా ఒకెత్తయితే.. చాలామంది సో కాల్డ్ ఇంపోర్టెడ్ విలన్లకంటే మనోడు బెటర్ విలన్ కూడా. అయినాసరే ఈయనకు ఛాన్సులు ఎందుకు రావట్లేదు?
సరిగ్గా ఇదే విషయాన్ని రవిబాబును అడిగితే.. అదే నాకు కూడా అర్ధంకావట్లేదండీ అంటున్నాడు. పైగా మనోడు కూడా చాలాసార్లు తన కో-స్టార్స్ అయిన నార్త్ నటులను ఇదే అడిగాడట. ఒకసారి విలన్ అశుతోష్ రాణాను మనోడు ఇలా అడిగాడట.. ''నాకు నీకంటే ఆంధ్రప్రదేశ్ లో 100 రెట్లు ఎక్కువ స్టార్డమ్ ఉంది. కాని చాలా ఎక్కువ డబ్బులిచ్చి మరీ నిన్నెందుకు పెట్టుకుంటున్నారు'' అన్నాడట. అతను ఏం రిప్లయ్ ఇచ్చాడో తెలియదు కాని.. టాలీవుడ్ మాత్రం కాస్త ఎరోగెంట్ కాబట్టే మనోడ్ని ఎక్కువగా తీసుకోవట్లేదూ అంటూ టాక్ పుట్టించేశారు.
దీనిపై కూడా స్పందించిన రవిబాబు.. ఈరోజుల్లో ఓ మాదిరి పొగరు లేనిది ఎవరికి అంటూ రివర్స్ కౌంటర్ వేశాడు. నిజమేలేండి.. ఓ రకంగా మనం తెచ్చుకునే పరాయి రాష్ట్రం నటులకంటే రవిబాబు చాలా బాగా చేస్తాడు. కాని ఎందుకో మనకు పొరుగింటి పుల్లకూర రుచించినట్లు.. మన ఇంట్లో ఉన్న చికెన్ బిర్యాని రుచించదు.