Begin typing your search above and press return to search.

రోమ్‌ కామ్‌ కోసం రవిబాబు యానిమ్యాట్రానిక్స్‌

By:  Tupaki Desk   |   23 Aug 2015 10:51 AM GMT
రోమ్‌ కామ్‌ కోసం రవిబాబు యానిమ్యాట్రానిక్స్‌
X
వైవిధ్యం అంటే అల్లరి రవిబాబు. రవిబాబు అంటే వైవిధ్యం. అందుకే అతడు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఓ ఎక్స్‌ పెరిమెంట్‌. సేమ్‌ టైమ్‌ కమర్షియల్‌ కంటెంట్‌ ని తెలివిగా చూపించాడన్న పేరొచ్చింది. ఇటీవలి కాలంలో కొన్ని పరాజయాలు ఎదురైనా టాలీవుడ్‌ లో ఉన్న అతికొద్ది ప్రతిభావంతులైన దర్శకుల్లో అతడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. టెక్నాలజీలోనూ రవిబాబు మిగతావారితో పోటీపడుతుంటాడు. లడ్డుబాబు కోసం ప్రోస్థటిక్‌ మేకప్‌ ని ఉపయోగించి చేసిన ప్రయోగం సినిమా పరంగా విజయం ఇవ్వకపోయినా అల్లరి నరేష్‌ ని అతడు చూపించిన విధానం అందరికీ నచ్చింది.

రవిబాబు ఇప్పుడు మరో ప్రయోగాత్మక కమర్షియల్‌ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇదో రొమాంటిక్‌ కామెడీ. దీనికోసం హాలీవుడ్‌ లో ఉపయోగించే అడ్వాన్స్‌ డ్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాడు. జురాసిక్‌ పార్క్‌, రోబో సినిమాలకు ఉపయోగించిన సాంకేతికతను ఉపయోగిస్తున్నాడు. ఈ విధానంలో రోబోటిక్‌ పరిజ్ఞానం చాలా అవసరం. దీనిని యానిమ్యాట్రిక్స్‌ అని కూడా పిలుస్తున్నారు. అత్యంత ఖరీదైన టెక్నాలజీ ఇది. అందుకే నేరుగా ఈ విధానాన్ని అవగాహన చేసుకుని వినియోగించాను అని రవిబాబు చెబుతున్నారు.

తెలుగు సినిమాల్లో మూగప్రాణుల్ని హింసిస్తూ చూపించకూడదు. అలాంటప్పుడు టెక్నాలజీనే ఆదుకుంటోంది. ఇది మన మంచికే కదా! అనీ అంటున్నాడు రవిబాబు. నా కథలో అమ్మాయి, అబ్బాయి క్యారెక్టర్లతో పాటు రంగుల మయం అనిపించే రోల్స్‌ చాలానే ఉన్నాయి. వాటికోసం యానిమ్యాట్రిక్స్‌ ని ఉపయోగిస్తున్నా. ఆ క్యారెక్టర్స్‌ ప్రస్తుతానికి సస్పెన్స్‌ అని చెప్పుకొచ్చాడు