Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లో ఈ వారం రవి ఎలిమినేట్?

By:  Tupaki Desk   |   28 Sep 2019 7:55 AM GMT
బిగ్ బాస్ లో ఈ వారం రవి ఎలిమినేట్?
X
బిగ్ బాస్ ఆట రంజుగా మారింది. గట్టి కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అవుతూ స్లోగా ఆడే వారందరూ హౌస్ లో ఉండడం తో మొన్నటి వరకూ ఊపు తగ్గిన బిగ్ బాస్ షోకు ఈవారం కావాల్సిన మసాలా అందింది. ఇన్నాళ్లు జంటగా ఉన్న వరుణ్ - వితిక - రాహుల్ - పునర్నవిలు విడిపోయారు. ఒక్క టాస్క్ వీరి మధ్య చిచ్చు పెట్టింది. ప్రాణస్నేహితులైన వరుణ్, రాహుల్ లు నువ్వా నేనా అన్నట్టుగా కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. టాస్క్ లో వరుణ్ ను ఎత్తి రాహుల్ కింద పడేయడం.. వితిక రాహుల్ చేతిని కొరికేయడంతో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు పొడచూపాయి. దీంతో వీరు నలుగురు రెండు గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకోవడం మానేశారు.ఇప్పుడు వరుణ్ -వితిక, రాహుల్ -పునర్నవిలు జంటలు గా మారి ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదు..

ఇక గురువారం బిగ్ బాస్ హౌస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అలీ రెజాను బిగ్ బాస్ గ్రాండ్ ఎంట్రీతో మళ్లీ లోపలికి పంపారు. ఫైర్ బ్రాండ్ అయిన అలీరెజా ఇంట్లోకి ప్రవేశంతో ఒక్కసారి ఇంట్లో వేడి పుట్టింది. ముఖ్యంగా ఒంటరిగా ఉంటున్న శివజ్యోతి, రవికి కొత్త ఊపిరి, ఉత్సాహం వచ్చింది. అలీరెజా ఎంట్రీ, వరుణ్-రాహుల్ గొడవతో ఈ వీకెండ్ యమ రంజుగా వీక్షకులకు కనువిందు చేసింది..

ఇక శనివారం వచ్చేసింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ కు వేళయ్యింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఈ వారం చాలా బలమైన కంటెస్టెంట్ ఎలిమినేషన్స్ లో ఉన్నారు. శ్రీముఖి - బాబా భాస్కర్ - రవి - వరుణ్ లు ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు..

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం బిగ్ బాస్ నుంచి రవి ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్ ను ఈ శనివారమే స్టార్ మా రూపొందిస్తుంది. సో అక్కడి నుంచి వచ్చిన లీక్స్ తోపాటు సోషల్ మీడియాలో ఓటింగ్ ట్రెండ్స్ ను బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రవినే అని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ సంస్థలు పెట్టిన ఓటింగ్ ప్రకారం కూడా రవికే తక్కువ ఓట్లు వచ్చాయట..దీంతో రవి ఎలిమినేట్ కావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

రవి బిగ్ బాస్ లో మంచివాడన్న పేరుతో ఎవ్వరినీ ఏమీ అనకుండా.. వివిధ సందర్భాల్లో స్పందించకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. యాక్టివ్ గా హౌస్ లో అన్నింట్లోనూ పాల్గొనడం లేదు. గేమ్స్ - టాస్క్ లలో తప్పితే గొడవలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సైలెంట్ గా ఉండే రవిని ప్రేక్షకులు ఈ వారం ఇంటికి పంపబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి రవి ఎలిమినేట్ అవుతాడా కాదా అన్న అసలు విషయం తెలియాలంటే మాత్రం ఈ ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..