Begin typing your search above and press return to search.
మహేష్ సినిమాకూ అదే సమస్య
By: Tupaki Desk | 11 Dec 2017 7:01 AM GMTఈ మధ్య తెలుగులో పెద్ద సినిమాల నుంచి సినిమాటోగ్రాఫర్లు తప్పుకోవడం.. మధ్యలో ఇంకొకరు వచ్చి బాధ్యతలు తీసుకోవడం చాలా మామూలైపోయింది. ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’కు ముందుగా ‘పీకే’ సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ ను తీసుకోవడం.. అతను మధ్యలో తప్పుకోగా.. ఛోటా కే నాయుడు సినిమాను పూర్తి చేశాడు. అంతకుముందు ‘జనతా గ్యారేజ్’కు ముందు ‘శ్రీమంతుడు’ సినిమాటోగ్రాఫర్ మాదిని తీసుకున్నాడు కొరటాల. కానీ ఏమైందో ఏమో.. అతను తప్పుకోవడం.. తిరు ఛాయాగ్రాహణ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక ‘సైరా’ సినిమా మొదలవడానికి ముందే ఈ చిత్రం నుంచి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవివర్మన్ తప్పుకుంటే.. ఆ స్థానంలోకి రత్నవేలు వచ్చాడు.
ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ఓ భారీ సినిమాకు మధ్యలో సినిమాటోగ్రాఫర్ మారినట్లు వార్తలొస్తున్నాయి. కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ సినిమా నుంచి అనివార్య కారణాల వల్ల రవి.కె.చంద్రన్ తప్పుకున్నట్లు.. ఆ స్థానంలోకి ‘జనతా గ్యారేజ్’ ఛాయాగ్రాహకుడు తిరునే వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు కారణాలేంటన్నది తెలియడం లేదు. ఓ సినిమా షూటింగ్ సజావుగా సాగాలంటే దర్శకుడు.. ఛాయాగ్రాహకుడి మధ్య చాలా సమన్వయంగా.. అవగాహన అవసరం. ఇద్దరికీ సింక్ అవ్వలేదంటే.. సినిమానే చెడిపోతుంది. అందుకే ఏదైనా తేడా వస్తే.. వెంటనే సినిమాటోగ్రాఫర్ మారిపోతున్నాడు. ఐతే ఒకసారి సినిమా మొదలయ్యాక.. మధ్యలో తేడా వచ్చినా సినిమాటోగ్రాఫర్లకు పేమెంట్ ఫుల్ గా ఇవ్వాల్సిందే. దీని వల్ల నిర్మాతలకు భారం అవుతున్నప్పటికీ.. సినిమా ముఖ్యం కాబట్టి దర్శకుల్ని ఏమీ అనలేక సర్దుకుపోతున్నారు.