Begin typing your search above and press return to search.
పవన్ నిర్మాత తనయుడు రీ ఎంట్రీ.. ఈసారైనా జనాలు పట్టించుకుంటారా?
By: Tupaki Desk | 17 April 2021 9:30 AM GMTపవన్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్న ఏ ఎమ్ రత్నం తనయుడు రవి కృష్ణ గతంలో హీరోగా నటించాడు. ఈతరం ప్రేక్షకులకు ఆయన కనీసం పరిచయం కూడా లేడు. అప్పటి ప్రేక్షకులు కొందరు రవి కృష్ణను మర్చి పోయి ఉంటారు. ప్రముఖ నిర్మాత రత్నం తనయుడిగా హీరోగా పరిచయం అయిన రవికృష్ణ కు లక్ కలిసి రాలేదు. ఆయన నటించిన 7/జి బృందావన్ కాలనీ సినిమా తప్ప మరేది కూడా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. 2011 తర్వాత ఆయన ఇప్పటి వరకు మళ్లీ సినిమాల్లో కనిపించింది లేదు. పదేళ్లకు పైగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న రవికృష్ణ మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆ సమయంలోనే రవికృష్ణ ఆకట్టుకోలేక పోయాడు. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తే జనాలు పట్టించుకుంటారా అంటే డౌటే అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవికృష్ణ ఇటీవలే ఒక కథకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవికృష్ణ హీరోగా మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు కథ ఓకే చెప్పాడట. తమిళంలో ఈ సినిమాను రూపొందించి తెలుగులో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రవికృష్ణ రీ ఎంట్రీ గురించి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ ను కనబర్చడం లేదు. ఈ సమయంలో ఆయన రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొడతాడనే నమ్మకం ఎవరికి లేదు.
సినిమాల్లో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టిన వారు ఎవరు లేరు. కనుక రవికృష్ణ కెరీర్ లో ఏదో అద్బుతం జరుగబోతుంది అని మాత్రం ఎవరు భావించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాత గా ఏఎమ్ రత్నం ఆమద్య కాస్త డల్ అయ్యి మళ్లీ పుంజుకున్నారు. అలాగే ఆయన తనయుడు కూడా ఏమైనా ప్రభావం చూపిస్తారేమో చూడాలి. రీ ఎంట్రీతో సక్సెస్ కాకున్నా కనీసం అందరి దృష్టిని ఆకర్షిస్తే తదుపరి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి రవికృష్ణ ను రీ ఎంట్రీతో అయినా జనాలు పట్టించుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.