Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ విజేత కంటే ఎక్కువ రెమ్యునరేషన్ రవికా?
By: Tupaki Desk | 29 Nov 2021 12:18 AM GMTబిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాలు మాత్రమే సాగే ఈ రియాల్టీ షోలో ఆదివారం రాత్రి యాంకర్ రవి ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఈ వారం రవి ఎలిమినేట్ అవుతారంటూ లీకులు వస్తున్నప్పటికీ.. కాజల్.. ప్రియాంక..సిరి.. మానస్ కంటే తక్కువ ఓట్లు రవికి రావటం ఏమిటి? సేఫ్ అవుతారన్న వాదన వినిపించినా.. బయటకు వచ్చిన లీకులే నిజమైని తేలాయి. ఏమైనా.. యాంకర్ రవి ఎలిమినేషన్ కావటాన్ని పలువురు ఇష్టపడటం లేదు. రవి ఎలిమినేషన్ ను టీవీల్లో చూసిన తర్వాత కొందరు అన్నపూర్ణ స్టూడియో ఎదుట నిరసన నిర్వహించటం.. తెలంగాణ వారికి బిగ్ బాస్ షోలో అన్యాయం జరుగుతుందని ఆగ్రహాం వ్యక్తం చేయటం గమనార్హం.
బిగ్ బాస్ షోలో ఏమైనా జరగొచ్చని.. ఎవరు కొనసాగుతారో? ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారన్న దానిపై ఒక స్పష్టత రాని పరిస్థితి. ఏ కారణంగా ఓటింగ్ తగ్గి.. బయటకువెళ్లిపోతారన్న దానిపై ఎలాంటి లెక్కలు బిగ్ బాస్ నిర్వాహకులు వెల్లడించారు. టాప్ త్రీలో ఒకరిగా భావించిన యాంకర్ రవి వెళ్లిపోవటాన్ని అత్యధికులు జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్ బాస్ షో నుంచి రవిని ఎలిమినేట్ చేసిన తీరు అన్ ఫెయిర్ అన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. షో నుంచి బయటకు వచ్చిన రవికి బిగ్ బాస్ నిర్వాహకులు చెల్లించిన రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రవికి వారానికి రూ.7-8లక్షల మొత్తాన్ని ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ లెక్కన పన్నెండు వారాలు నిరాటకంగా కొనసాగిన యాంకర్ రవికి ఏకంగా కోటి రూపాయిల వరకు రెమ్యునరేషన్ దక్కినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం.. బిగ్ బాస్ విజేతకు లభించే ప్రైజ్ మనీ కంటే ఎక్కువ కావటం గమనార్హం. భారీగా రెమ్యనరేషన్ ఇస్తున్న నేపథ్యంలో ఆయన్ను ఇంటి నుంచి పంపించి ఉంటారన్న వాదన వినిపిస్తున్నా.. అందులో లాజిక్ లేదనే చెప్పాలి.
దీనికి మించి మరేదో కారణం ఉంటుందని చెప్పొచ్చు. విజేతగానిలుస్తారన్న అంచనాలు ఎక్కువగా ఉన్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న సన్నీ విషయాన్నే తీసుకుంటే.. అతనెన్ని తప్పులు చేసినా.. అతనెంత తొండి ఆడినా.. అతనిపై ఎలాంటి లేబులింగ్ చేయలేదని.. అందుకు భిన్నంగా రవి మీద ఎంట్రీ నుంచే లేబిలింగ్ చేయటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఏమైనా.. యాంకర్ రవికి బిగ్ బాస్ అన్యాయం చేశాడనే మాట పలువురి నోట వినిపించటమే కాదు.. దరిద్రపుగొట్టు నిర్ణయాన్ని ఇచ్చారంటూ తిట్టిపోస్తున్నారు. అయితే.. యాంకర్ రవిమాత్రం ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మాత్రం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ఇంతకాలం తనకు ఓట్లు వేసిన వారికి.. తనకు మద్దతు ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పారు.