Begin typing your search above and press return to search.

రవితేజ బ్రేక్ ఇచ్చాడా?

By:  Tupaki Desk   |   3 July 2018 7:00 AM IST
రవితేజ బ్రేక్ ఇచ్చాడా?
X
మాస్ రాజా మహారాజా కెరీర్ ట్రాక్ ఎటువెళుతుందో ఏమో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఆయన మాత్ర స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. రెగ్యులర్ సినిమాలు ఇక చేయను అని చెప్పిన రవితేజ రాజా ది గ్రేట్ హిట్ తరువాత మళ్ళీ అదే బాట పట్టి ఆడియెన్స్ ని నిరుత్సాహపరిచారు. మాస్ రాజా అభిమానులు మాంత్రం ఇంకా ఆయన నుంచి సక్సెస్ సినిమాలు వస్తాయని ఆశపడుతున్నారు.

అయితే రవితేజ ఈ సారి కొంచెం స్పీడ్ తగ్గించి పూర్తిగా ఒక సినిమాపై దృష్టి పెట్టె ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం ఓ సక్సెల్ ఫుల్ కథను కూడా ఆపేశాడట. ప్రస్తుతం ఈ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ అంథోని సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంతోష్ శ్రీనివాస్ తో కోలీవుడ్ హిట్టు కథ తేరి చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే రెండు సినిమాల షూటింగ్ లను మాస్ రాజా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడట.

అసలే శ్రీను వైట్ల సినిమాలో మూడు విభిన్న పాత్రలు చేయాలి కాబట్టి క్యారెక్టర్స్ విషయంలో కొంచెం హెవీ వర్క్ అవుతోంది అని మనోడు దృష్టి మొత్తం ఒకే సినిమాపై పెట్టాలని తేరికి బ్రేక్ ఇచ్చాడట. ప్రముఖ సన్నివేశాలు ఒక దశకు వచ్చాక షూటింగ్ లో పాల్గొంటాను అని దర్శకుడితో మాట్లాడుకున్నాడని సమాచారం. మరి రవితేజ చేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.