Begin typing your search above and press return to search.

వాటి గురించి చెబితే బావుండేది రాజా

By:  Tupaki Desk   |   11 Aug 2016 5:42 AM GMT
వాటి గురించి చెబితే బావుండేది రాజా
X
మాస్ మహరాజ్ రవితేజ ఇప్పుడు సడెన్ గా వార్తల్లోకి వచ్చేశాడు. అది కూడా తన సినిమా గురించి కాదు.. చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ సాధించిన పెళ్లిచూపులు మూవీని చూశాడట రవితేజ. పెళ్లి చూపులు క్లాస్ మూవీలా ఉన్నా.. ఈ మాస్ హీరోకి ఎంతగా నచ్చిందంటే తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయాడు.

'ఈ మధ్య కాలంలో మనసును తాకిన సినిమాల గురించి చెబితే.. బాలీవుడ్ లో కపూర్ అండ్ సన్స్. ఆ తర్వాత తెలుగులో 'పెళ్ళి చూపులు' సినిమా నచ్చింది' అంటూ స్ట్రైట్ గా పాయింట్ కొచ్చేసిన రవితేజ.. 'సినిమాలోని కంటెంట్ చాలా ఫ్రెష్ గా ఉండడమే కాదు బాగుంది కూడా. ప్రతీ సీన్ నా కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించిందే తప్ప.. రెండు గంటల సినిమా చూస్తున్నట్లుగా లేదు. పెళ్లి చూపులు నాకు ఎంతగా నచ్చేసిందంటే.. ఇప్పటికే ఈ సినిమాలో కమెడియన్లుగా పనిచేసిన ఇద్దరికీ ఫోను చేసి కూడా మాట్లాడాను' అని చెప్పాడు రవితేజ.

బాగున్న సినిమాని పొగడ్డం బాగానే ఉంది కానీ.. బెంగాల్ టైగర్ తర్వాత ఇప్పటివరకూ తాను సినిమా మొదలుపెట్టకపోవడానికి కారణం కానీ.. పోనీ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే డీటైల్స్ కానీ చెప్పలేదు రవితేజ. ఆ డీటైల్స్ కూడా చెబితే ఫ్యాన్స్ కి కూడా కాసింత ఊరటగా ఉండేది కదా! వాట్ మాస్ రాజా.. వాట్ డు యు సే?