Begin typing your search above and press return to search.
పుకార్లకు ఫుల్ స్టాప్.. డిస్కోరాజా స్టార్ట్
By: Tupaki Desk | 4 March 2019 7:09 AM GMTమాస్ మహారాజా రవితేజ టైం ఈమద్య కాలంలో ఏమాత్రం బాగోలేదు, అయినా కూడా మొండి ధైర్యంతో రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే గతంలో మాదిరిగా కాకుండా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ ను తనకు తెలిసిన రచయితలతో ఒకటికి రెండు మూడు సార్లు చర్చించి ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్తున్నాడు. అయినా కూడా ఫలితం దక్కడం లేదు అది వేరే విషయం అనుకోండి. రవితేజ తన తదుపరి చిత్రాన్ని విఐ ఆనంద్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే సినిమా ప్రారంభం ఆలస్యం అవుతూ వస్తోంది.
'డిస్కోరాజా' ఆలస్యంకు రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. స్క్రిప్ట్ విషయంలో రవితేజ మరియు విఐ ఆనంద్ ల మద్య విభేదాలు తలెత్తాయని, రవితేజ సూచించిన మార్పులను ఆనంద్ చేసేందుకు నో చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో పాటు ఈ చిత్ర నిర్మాత పారితోషికం విషయంలో రవితేజను కాస్త తగ్గమని సూచించాడని, అందుకు రవితేజ నో చెప్పాడని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. సినిమా అసలు పట్టాలెక్కేనా లేదా అంటూ అంతా కూడా గుసగుసలాడుతున్న సమయంలో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.
స్క్రిప్ట్ విషయంలో రవితేజ, ఆనంద్ ల మద్య విభేదాలు మరియు పారితోషికం గురించిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది. ఆనంద్ పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడని, రవితేజకు తగ్గట్లుగా మంచి స్క్రిప్ట్ ను విఐ ఆనంద్ రెడీ చేశాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. పక్కా స్క్రిప్ట్ రెడీ అయిన నేపథ్యంలో రేపటి నుండే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మణికొండ ఏరియాలో మొదలు కాబోతుంది.