Begin typing your search above and press return to search.

మాస్ రాజా మూసరాజాలా ఉన్నాడే!

By:  Tupaki Desk   |   15 Dec 2022 1:30 AM GMT
మాస్ రాజా మూసరాజాలా ఉన్నాడే!
X
టాలీవుడ్ హీరోలంతా మారారు. లుక్ ప‌రంగా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. న్యూ మేకోవ‌ర్ లో క‌నిపించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. చివ‌రికి మెగాస్టార్ చిరంజీవి..బాల‌కృష్ణ‌...వెంక‌టేష్‌..నాగార్జున లాంటి సీనియ‌ర్ స్టార్లు కూడా ఈ మ‌ధ్య కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. కొత్త ఆహార్యంలో క‌నిపించ‌డం కోసం శ‌రీరాకృతిల్లో సైతం చిన్న చిన్న‌మార్పులు చేసారు.

ఆ త‌ర్వాతి త‌రం హీరోలు చ‌ర‌ణ్‌...తార‌క్..బ‌న్నీ...మ‌హేష్‌...ప్ర‌భాస్...రానా లాంటి వారిలో మార్పుల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా ..సినిమాకి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అనేది త‌ప్ప‌నిస‌రిగా భావిస్తున్నారు. కొత్త క‌థ‌ల‌తో పాటు మేకోవ‌ర్ తోనూ అద‌ర‌గొడుతు న్నారు. మ‌రి టాలీవుడ్ లో మార‌ని హీరో ఎవ‌రైనా ఉన్నారా? అంటే ఉన్నార‌నే చెప్పాలి.

అత‌నే మాస్ మ‌హారాజా ర‌వితేజ. ఈ హీరో లుక్ విష‌యంలో నెట్టింట పెద్ద చ‌ర్చే సాగుతుంది. ఏ కథైనా..ఎలాంటి స్టోరీ అయినా రాజా లుక్ మాత్రం మార్చ‌డు అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. వీలైనంత వ‌ర‌కూ త‌న మాసిజాన్నిచూపించాడ‌నికే ఇష్ట‌ప‌డ‌తాడు త‌ప్ప‌..కొత్త‌గా ట్రై చేద్దామ‌నే ఆలోచ‌న రాదంటూ నెట్టింట చంటేస్తున్నారు. లుక్ ప‌రంగా హీరోలంతా మార్పులు చేస్తుంటే ఈయ‌న మాత్రం ఇంకా బీసీ రోజుల్లోనే ఉన్నాడంటున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా మూడు సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాటిలో అన్ని చిత్రాల్లోనూ దాదాపు ఒకే ర‌క‌మైన లుక్తో క‌నిపిస్తున్నాడంటూ నెట్టింట ట్రోలింగ్ జ‌రుగుతోంది. మాస్ రాజానా...లేక మూస రాజానా? అంటూ సెటైర్లు వేసేస్తున్నారు. కాస్త గ‌తంలోకి వెళ్తే ఆ చిత్రాల్లోనూ రాజా లుక్ లు ఎలాంటి మార్పు లేదంటున్నారు.

సింపుల్ హెయిర్ స్టైల్..గ‌డ్డం..మీసం త‌ప్ప‌! తెర‌పై ప్రెష్ గా ఎప్పుడు క‌నిపించాడ‌ని రాజా స్టైల్లో బ‌ళ్లున న‌వ్వేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా హీరోగారు ఇవ‌న్నీ గ్ర‌హించి కొత్త‌గా ట్రై చేస్తాడేమో చూడాలి. ప్ర‌స్తుతం ర‌వితేజ `వాల్తేరు వీర‌య్య` లో చిరంజీవి స‌వ‌తి సోద‌రుడి పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.. `రావ‌ణ‌సుర` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. `వాల్తేరు వీర‌య్య` లుక్ రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి నెగిటివిటీ మ‌రింత ఎక్కువైంది. మ‌రి రాజా వీటిని గ్ర‌హిస్తున్నాడో? లేదో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.