Begin typing your search above and press return to search.

రవితేజ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   31 Jan 2018 5:57 PM GMT
రవితేజ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు
X
మాస్ హీరో రవితేజ పై టాలీవుడ్ లో ఓ టాక్ ఉంది. ఎవరైనా ఓ దర్శకుడు ఫ్లాప్ అయితే.. అతన్ని ఆదుకునేందుకు తన వంతుగా ఓ సినిమా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడని అంటారు. రవితేజతో గతంలో అనుబంధం ఉన్న వ్యక్తి అయితే.. ఈ పిలుపు ఇంకా త్వరగా అందుతుందని అంటారు. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేసేందుకు అంగీకరించడం కూడా ఈ ఉద్దేశ్యంతోనే అనే మాట వినిపిస్తోంది.

రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం రెండు రోజుల్లో విడుదల కానుండడంతో.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సమయంలో మాస్ మహరాజ్ కు తర్వాతి ప్రాజెక్టులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. తనకు గతంలో మంచి చిత్రాలు ఇచ్చాడనే ఉద్దేశ్యంతోనే.. ఫ్లాప్ లతో ఉన్న శ్రీను వైట్లను ఇలా ఆదుకుంటున్నారా అనే ప్రశ్నకు.. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు రవితేజ. ఇండస్ట్రీలో ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయడం కుదరదని.. అన్నీ కరెక్ట్ గా ఉంటేనే సినిమా చేస్తామని అన్నాడు రవితేజ.

తన స్నేహితుడు కాబట్టే సినిమా చేస్తున్నాననే మాటలో వాస్తవం లేదని తేల్చేశాడు రవితేజ. ఒక రకంగా చూస్తే రవితేజ కరెక్ట్ గా ఉన్నాడనే చెప్పాలి. ఒకరిని ఆదుకునేందుకు ప్రయత్నించడం సినిమా ఇండస్ట్రీలో దాదాపు అసంభవం. అలాంటి ప్రయత్నాలు చేసి తమ కెరీర్ కు ముప్పు తెచ్చుకోవడం కుదరదని ఇన్ డైరెక్టుగా తేల్చి చెప్పేశాడు మాస్ మహరాజ్.