Begin typing your search above and press return to search.
బెంగాల్ టైగర్.. ఇప్పుడంటే ఇప్పుడే
By: Tupaki Desk | 31 Oct 2015 8:53 AM GMTఈ ఏడాది టాలీవుడ్ సినిమాలకు రిలీజ్ డేట్ల విషయలో ఏదో శాపం తగిలినట్లుంది. ఈ ఏడాది ఇప్పటికా అనుకున్న తేదీకి విడుదలైన పెద్ద సినిమా ఒక్క ‘బ్రూస్ లీ’ మాత్రమే. మిగతావన్నీ వాయిదా పడ్డవే. తాజాగా అఖిల్ - బెంగాల్ టైగర్ సినిమాల రిలీజ్ విషయంలోనూ పెద్ద గందరగోళమే నడుస్తోంది. దసరాకు రావాల్సిన ‘అఖిల్’ వాయిదా పడటటంతో నవంబరు సినిమాల షెడ్యూళ్లు కూడా దెబ్బతిన్నాయి. నవంబరు 5న రావాల్సిన బెంగాల్ టైగర్ వాయిదా పడ్డానికి కూడా ‘అఖిల్’ మూవీనే కారణం. ఐతే ఊరికే నెపం ‘అఖిల్’ మీదికి నెట్టేస్తున్నారు కానీ.. ‘బెంగాల్ టైగర్’ విషయంలో కొన్ని రిపేర్లు, రీషూట్లు జరుగుతుండటం కూడా విడుదల వాయిదా పడ్డానికి కారణం అంటూ ఓ ప్రచారం కూడా జరుగుతోంది టాలీవుడ్లో.
ఐతే అది శుద్ధ అబద్ధమని.. ‘బెంగాల్ టైగర్’ వాయిదాకు ‘అఖిల్’ సినిమానే కారణమని నిర్మాత రాధామోహన్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ‘బెంగాల్ టైగర్’ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తయిందని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉందని.. ఇప్పుడనుకుంటే ఇప్పుడే సినిమాను విడుదల చేయగలమని ఆయన చెప్పారు. అఖిల్ - బెంగాల్ టైగర్.. ఈ రెండు సినిమాల్నీ నైజాంలో ఒకే డిస్ట్రిబ్యూటర్ కొన్నాడని.. అందుకే రెంటికి మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాడని.. ‘అఖిల్’ నవంబరు 11న విడుదల చేయాలనుకుంటుండటంతో ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేయాల్సి వస్తోందని.. అఖిల్ విషయంలో క్లారిటీ వచ్చాక తమ సినిమా డేటు ప్రకటిస్తామని రాధామోహన్ చెప్పాడు.