Begin typing your search above and press return to search.

భ‌ర‌త్ మ‌ర‌ణాన్ని ఎందుకు గుర్తించ‌లేదు?

By:  Tupaki Desk   |   25 Jun 2017 7:33 AM GMT
భ‌ర‌త్ మ‌ర‌ణాన్ని ఎందుకు గుర్తించ‌లేదు?
X
రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ సినీ హీరో ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ దుర్మ‌ర‌ణం పాలు కావ‌టం తెలిసిందే. వాస్త‌వానికి శ‌నివారం రాత్రి ప‌దిన్న‌ర గంట‌ల స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగితే.. ఆదివారం ఉద‌యం ప‌దిన్న‌ర త‌ర్వాత బ‌య‌ట‌కు రావ‌టం విస్మ‌యాన్ని రేకెత్తిస్తోంది. రోడ్డు ప్ర‌మాదంలో ఒక ప్ర‌ముఖుడు మ‌ర‌ణిస్తే.. ఇంత ఆల‌స్యంగా గుర్తించ‌టం ఏమిట‌న్న‌ది సందేహంగా మారింది.

పోలీసు వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. రాత్రి 10.10 నుంచి 10.25 మ‌ధ్య‌లో ఔట‌ర్ రింగురోడ్డు లోని శంషాబాద్ మండ‌లం కొత్వాల్ గూడ స‌మీపంలోని ఔట‌ర్ రింగు రోడ్డు మీద భ‌ర‌త్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. చెన్న‌మ్మ హోట‌ల్ ద‌గ్గ‌ర ఆగి ఉన్న లారీని భ‌ర‌త్ ప్ర‌యాణిస్తున్న స్కోడా కారు (టీఎస్ 07 ఈసీ 0799) బ‌లంగా ఢీ కొంది.

శంషాబాద్ లోని నోవాటెల్ హోట‌ల్లో శ‌నివారం రాత్రి పార్టీ ఒక‌టి జ‌రిగింది. దీనికి హాజ‌రై తిరిగి గ‌చ్చిబౌలికి వెళుతున్న వేళ ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. లారీ బ్రేక్ డౌన్ కావ‌టంతో రోడ్డు మీద‌నే లారీని నిలిపివేశారు. చీక‌టిగా ఉండ‌టంతో లారీని గుర్తించ‌లేక ఢీ కొట్టారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లంలోనే భ‌ర‌త్ మ‌ర‌ణించారు. కారు యాక్సిడెంట్ జ‌రిగిన వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందింది. మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

చ‌నిపోయింది ఎవ‌ర‌న్న విష‌యం మీద స్ప‌ష్ట‌త లేదు. కారు నెంబ‌రు ఆధారంగా య‌జ‌మాని ఎవ‌ర‌న్న‌ది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. భ‌ర‌త్ అమ్మ పేరు మీద కారు ఉంది. భూప‌తిరాజు రాజ్య‌ల‌క్ష్మి పేరిట కారు ఉండ‌టంతో ఎవ‌ర‌న్న విష‌యాన్ని పోలీసులు గుర్తించ‌లేక‌పోయారు. రాజ‌స్థాన్ లో పుట్టిన వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లుగా తేల్చారు. అయితే.. చ‌నిపోయింది ర‌వితేజ సోద‌రుడు అని మాత్రం గుర్తించ‌లేదు. అయితే.. ఈ రోజు ఉద‌యం చ‌నిపోయింది ర‌వితేజ సోద‌రుడ‌న్న స‌మాచారాన్ని మీడియా వ‌ర్గాలు పోలీసుల‌కు.. ఆర్టీవో అధికారికి స‌మాచారం ఇచ్చారు.

దీంతో.. భ‌ర‌త్ మృత‌దేహాన్ని తీసుకెళ్ల‌టానికి వ‌చ్చిన అత‌డి స్నేహితుల్ని పోలీసులు క్రాస్ చెక్ చేశారు. భ‌ర‌త్ పుట్టింది రాజ‌స్థాన్‌లోనేన‌ని.. మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో విష‌యాన్ని గోప్యంగా వ‌చ్చిన‌ట్లుగా వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రాత్రి ప‌ది గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగితే.. ఉద‌యం ప‌ది గంట‌ల వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌టం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.అయితే.. ప్ర‌మాదం జ‌రిగిన చోట లైట్లు లేక‌పోవ‌టంతో మృత‌దేహాన్ని గుర్తించ‌లేక‌పోయార‌ని చెబుతున్నారు. దీనికి తోడు ముఖం మీద దెబ్బ‌లు త‌గ‌ల‌టం.. ర‌క్తంతో నిండి ఉండ‌టంతో పోల్చ‌లేదంటున్నారు.

భ‌ర‌త్ మ‌ర‌ణాన్ని స్నేహితులు గుట్టుగా ఉంచ‌టంపై వినిపిస్తున్న వాద‌న ఏమిటంటే.. పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చిన భ‌ర‌త్ స్నేహితులు ముగ్గ‌రు.. పోస్ట్ మార్టం పూర్తి అయితే మృత‌దేహాన్ని తీసుకెళ‌తామ‌ని చెప్పారే. అంతేకానీ..చ‌నిపోయింది ర‌వితేజ సోద‌రుడు అన్న విష‌యాన్ని మాత్రం పోలీసుల‌కు చెప్ప‌లేదు. పోలీసులు క్రాస్ క్వ‌శ్చ‌న్స్ వేసిన‌ప్ప‌టికీ.. చ‌నిపోయింది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుడన్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. త‌ర్వాత కాసేప‌టికే మీడియా వ‌ర్గాలు అందించిన స‌మాచారంతో ఆర్టీఏ అధికారి పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌టంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌మాదం జ‌రిగిన తీరు చూస్తే.. రాత్రి వేళ ఏదైనా వాహ‌నం చెడిపోతే.. దాన్ని వేరే చోట‌కు త‌ర‌లించాలి. ఇందుకు సంబంధించి గ‌తంలో కాస్త ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఉండ‌టం.. రాత్రివేళ‌లో లైట్లు లేక‌పోవ‌టంతో చీక‌ట్లో రోడ్డు ప‌క్క‌గా ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్ట‌టంతో ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మ‌చారం ప్ర‌కారం.. రోడ్డు ప్ర‌మాదంలో భ‌ర‌త్ చ‌నిపోయిన విష‌యాన్ని ర‌వితేజ కుటుంబీకులు న‌మ్మ‌లేద‌ని.. యాక్సిడెంట్ ఫోటోల్ని చూపించిన‌ప్పుడు.. పోలిక‌లు కాస్త క‌నిపిస్తున్నాయే అని చెప్పారంటున్నారు. ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే హ‌డావుడిగా ఉస్మానియాకు వెళ్లార‌ని.. మృత‌దేహాన్ని చూసి గుర్తించార‌ని చెబుతున్నారు. బ‌యట వారికి చెప్ప‌క‌పోవ‌టంతో.. ఈ విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

భ‌ర‌త్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఉదంతంలో లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగానే చెబుతున్నారు. బ్రేక్ డౌన్ అయిన లారీని రోడ్డుకు ప‌క్క‌న పెట్టాల్సి ఉన్నా.. అలాంటిదేమీ చేయ‌క‌పోవ‌టంతో ఇంత దారుణం జ‌రిగిందంటున్నారు. లారీ వెనుక రేడియం స్టిక్క‌ర్లు లాంటివేవీ లేక‌పోవ‌టం కూడా ప్ర‌మాదానికి కార‌ణ‌మైంద‌ని చెబుతున్నారు. లారీ నిలిచిన త‌ర్వాత‌.. వాహ‌నం ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యేలా రేడియం స్టిక్క‌ర్లు. ప్ర‌మాద సూచిక‌ను ఏర్పాటు చేయ‌క‌పోవ‌టం కూడా ప్ర‌మాదానికికార‌ణంగా తెలుస్తోంది. బ్రేక్ డౌన్ అయిన లారీ ఫుల్ లోడ్ తో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీ మీద చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన తీరును చూస్తే.. రాత్రి వేళ‌.. చీక‌ట్లో నిలిపి ఉన్న లారీని గుర్తించే విష‌యంలో జ‌రిగిన పొర‌పాటే.. ఇంత దారుణానికి కార‌ణ‌మైందంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/