Begin typing your search above and press return to search.
పటాస్ కథ ముందు తనకే చెప్పారట
By: Tupaki Desk | 16 Oct 2017 7:08 AM GMTఒక కథను ఎవరికో అనుకుంటారు. కానీ అది ఇంకెవరి దగ్గరికో వస్తుంది. ఇప్పుడు రవితేజ చేసిన ‘రాజా ది గ్రేట్’ విషయంలోనూ అలాగే జరిగింది. ఈ కథను ముందు యంగ్ హీరో రామ్ కు చెప్పాడు అనిల్ రావిపూడి. అతను ఓకే అన్నాడు. సినిమాను అనౌన్స్ చేశారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల ముందుకు కదల్లేదు. తర్వాత రవితేజ లైన్లోకి వచ్చాడు. ఇక ‘ఆర్య’ కథ ముందు రవితేజ దగ్గరికే వెళ్లింది. కానీ చివరికి అల్లు అర్జున్ తో ఓకే అయింది. ‘భద్ర’ కథ ముందు బన్నీ దగ్గరికెళ్లి.. చివరికి రవితేజతో పట్టాలెక్కింది. ఇలా తన కెరీర్లో తాను మిస్సయిన ఒక సూపర్ హిట్ సినిమా ఉందని రవితేజ చెప్పాడు. అదే.. పటాస్.
అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతూ నందమూరి కళ్యాణ్ రామ్ తో తీసిన ‘పటాస్’ ముందు మాస్ రాజాకే వినిపించాడట. కొన్ని కారణాల వల్ల ఆ కథతో తాను సినిమా చేయలేకపోయానని రవితేజ వెల్లడించాడు. తనకు అనిల్ చాలా కాలం నుంచి తెలుసని.. అతడి మీద తనకు చాలా నమ్మకం అని మాస్ రాజా చెప్పాడు. తన ‘దరువు’ సినిమాకు అనిల్ పని చేసినట్లు తెలిపాడు. హీరో పూర్తిగా అంధుడిగా కనిపించే ‘రాజా ది గ్రేట్’ కథను ఇంకెవరైనా చెప్పుంటే కనీసం వినడానికి కూడా అంగీకరించేవాడిని కాదని రవితేజ అన్నాడు. అనిల్ కాబట్టే ఈ కథ వినడానికి ఒప్పుకున్నట్లు తెలిపాడు. దిల్ రాజు ఫోన్ చేసి ఈ కథ వినమని చెప్పాడని.. నరేషన్ అయిపోయాక తాను చాలా ఎగ్జైట్ అయిపోయానని చెప్పాడు. ఇప్పటిదాకా హీరోలు అంధులుగా.. వికలాంగులుగా చేసి ఉంటారని.. కానీ ‘రాజా ది గ్రేట్’ లాంటి సినిమా మాత్రం ఎవరూ చేసి ఉండరని మాస్ రాజా తేల్చి చెప్పాడు.