Begin typing your search above and press return to search.
మాస్ రాజా కన్ఫామ్ చేసేశాడు
By: Tupaki Desk | 1 Feb 2018 4:49 PM GMT'అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో' అనే డైలాగ్ అందరికి చాలా వరకు గుర్తుండే ఉంటుంది. అయితే జీవితంలో రాజకీయాలకు ఆ డైలాగ్ సెట్ అయినట్లే సినిమా ఇండస్ట్రీలకు కూడా సెట్ అవుతుందని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఆ ఆలోచనతో కాకుండా కొంత మంది ఇతరులకు బ్రేక్ ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు. ఆ విధంగా సపోర్ట్ తో వచ్చిన వారు చాలామందే ఉన్నారు.
అదే తరహాలో ఒకప్పుడు రవితేజ కెరీర్ కు మంచి ఎనర్జీని ఇచ్చిన శ్రీను వైట్లకు ఇప్పుడు అతనే హెల్ప్ అవుతున్నాడు. వీరి కెరీర్ చాలావరకు రిజల్ట్ తో సంబంధం లేకుండా కొనసాగింది. అయితే ఇద్దరు ఒకేసారి మళ్లీ డౌన్ అయ్యారు. కానీ రవితేజ ముందు పికప్ అయ్యి ఇప్పుడు శ్రీను వైట్లను లిఫ్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇక వచ్చే నెలలో వీరి కలయికలో ఒక మంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కథ తెరకెక్కడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని రవితేజ రీసెంట్ గా సోషల్ మీడియా చిట్ చాట్ లో తెలిపాడు.
ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే కళ్యాన్ కృష్ణ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. అయితే నెక్స్ట్ మంత్ గ్యాప్ రావడంతో రెండు షూటింగ్ లను కవర్ చేసే విధంగా మాస్ రాజా ప్లాన్ చేసుకున్నాడట. శ్రీను వైట్ల సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏమీ లేవు. రవితేజ దర్శకులకు బూస్ట్ ఇవ్వడంలో ముందుంటాడు అనేది వాస్తవం. ఇక నాలుగోసారి వచ్చే ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.