Begin typing your search above and press return to search.
రవి తేజ 'గున్న గున్న మామిడి' స్పెషల్
By: Tupaki Desk | 16 Oct 2017 6:04 AMరవితేజ కెరీర్ లో ఒక ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని రవి తేజ చూస్తున్నాడు. గత ఏడాది సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయిన రవి ఈ సినిమాపై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. నిర్మాత దిల్ రాజు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. అంతే కాకుండా సినిమా రవితేజ కెరీర్ లోనే ఒక మంచి చిత్రంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు.
సినిమాలో రవి తేజ బ్లైండ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఎనర్జీతో తో ఉండే రవి సినిమాలో చూపులేని వాడిగా ఎలా కనిపిస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలో అందరికి గుర్తిండిపోయే మరొక స్పెషల్ మూమెంట్ ఉండబోతోందట. సినిమాలో గున్న గున్న మామిడి అనే ఒక బిట్ సాంగ్ ఉండబోతోందని ఆ ఎపిసోడ్ లో రవి తేజ వేసే స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటాయని దర్శకుడు తెలిపాడు.
పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అలాంటి బిట్స్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అత్తారింటికి దారేది - కాటమరాయుడు సినిమాల్లో ఆయన వేసిన స్టెప్పులకి అందరు ఫిదా అయ్యారు. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా గున్న గున్న మామిడి అనే బిట్ సాంగ్ ని ఇరగదీశాడని తప్పకుండా సినిమాలో అది స్పెషల్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో రెండు రోజుల వరకు ఆగాల్సిందే.