Begin typing your search above and press return to search.
గిల్డ్ షాక్ తో మారిన మాస్ రాజా నిర్ణయం?
By: Tupaki Desk | 24 Aug 2022 12:30 AM GMTటాలీవుడ్ లో కరోనా తరువాత విప్తవాత్మక మార్పులొచ్చాయని, ప్రేక్షకుల అభిరుచిలో రూడా మార్పులు చోటు చేసుకున్నాయని, పారితోషికాలు, నిర్మాణ వ్యయంలోనూ మార్పులు వచ్చాయని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, ఓటీటీ నియంత్రణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుందని యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ టాలీవుడ్ షూటింగ్ ల బంద్ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపత్యంలో ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ పాటిస్తూ ప్రొడ్యూసర్స్ ఒక్కో సమస్యపై చర్చిస్తూ వస్తున్నారు.
రీసెంట్ గా `మా`ని కలిసి ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ పై కొన్ని కండీషన్స్ వినిపించారట. ఇందుకు `మా` సానుకూలంగా స్పందించిందని దిల్ రాజు ఇటీవల వెల్లడించారు కూడా. ఈ నిర్ణయం ఇప్పుడు మాస్ రాజా కు షాకిచ్చిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో హీరోగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మాస్ మహారాజాగా ఓ వెలుగు వెలుగుతున్నారు. గత కొంత కాలంగా రెమ్యునరేషన్ ని బట్టి సినిమాలు అంగీకరిస్తూ వెళుతున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
గడిచిన మూడేళ్లలో రవితేజ తన రెమ్యునరేషన్ ని రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లకు పెంచేశాడు. వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా సరే తన వద్దకు వచ్చే ప్రొడ్యూసర్ ల డిమాండ్ ని బట్టి మాస్ రాజా పారితోషికాన్ని పెంచుతూ పోయారు. అయితే ఇక నుంచి ఈ పెరుగుదలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం గిల్డ్ తాజాగా రెమ్యునరేషన్ లపై తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో తన పారితోషికాన్ని మరో రెండేళ్ల పాటు పెంచకూడదని రవితేజ నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా తన పారకితోషికాన్ని మించి ఎలాంటి ఖర్చులని కూడా నిర్మాతల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ డిమాండ్ చేయకూడదని రవితేజ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రవితేజ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో హీరోగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`లో కీలక అతిథి పాత్రలో నటిస్తున్నాడు. హీరోగా నటిస్తున్న సినిమాలు త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో `ధమాకా`, సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న `రావణాసుర`, స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బమోపిక్ ఆధారంగా వంశీ రూపొందిస్తున్న`టైగర్ నాగేశ్వరరావు` వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.