Begin typing your search above and press return to search.
మాస్ రాజా రీ షూట్ లకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడా?
By: Tupaki Desk | 24 Nov 2022 10:30 AM GMTకరోనా తరువాత చాలా వరకు నిర్మాతలు బబ్జెట్ పై నియంత్రన వుండాలని, ఇందు కోసం చాలా వరకు హీరోయిన్ స్టాఫ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల క్యారవాన్ ఖర్చులు, వారి వ్యక్తగత సిబ్బంది ఖర్చులు తగ్గించుకోవాలని, హీరోయిన్ ల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు వారి పారి పారితోషికం నుంచే ఖర్చు చేసుకోవాలంటూ ఆ మధ్య నిర్మాతలు ఓ నిర్ణయానికి రావడం..దాన్ని 'మా' కు వివరించడం తెలిసిందే. చిన్న విషయాల్లో బడ్జెట్ ని కంట్రోల్ చేయగలుగుతున్న ప్రొడ్యూసర్స్ ప్రధాన విషయంలో మాత్రం సరెండర్ అవుతున్నారు.
ఎంత పక్కగా ప్లాన్ చేసుకుని బడ్జెట్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా రీ షూట్ ల కారణంగా అది కుదరకపోగా మరింతగా భారంగా మారుతోందని తెలుస్తోంది. మరీ ప్రధానంగా మాస్ మహారాజా రవితేజ సినిమాలకు ఇది ప్రతీసారి రిపీట్ అవుతుండటం గమనార్హం. ఇటీవల 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విషయంలో రీ షూట్ లు చేయడం తెలిసిందే. దాని కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది కూడా.
ఎంత రీ షూట్ లు చేసినా ఫైనల్ గా 'రామారావు ఆన్ డ్యూటీ' డిజాస్టర్ అనిపించుకుని భారీ నష్టాలని అందించింది. ఇప్పడు రవితేజ నటిస్తున్న సినిమాకు కూడా ఇదే సమస్య తలెత్తిందని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధామాకా'. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథనాయికగా నటిస్తోంది.
ఈ మూవీకి కూడా రీ షూట్ లు తప్పలేదని తెలుస్తోంది. రీ షూట్ ల కోసం కొత్త రైటర్ సహకారం తీసుకున్నారట. అతను రాసిన సీన్ లని షూట్ చేసి మళ్లీ ఈ మూవీకి జోడించినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. తను రాసిన కొన్ని సీన్ లని పక్కన పెట్టి 'కార్తికేయ 2' కు ఓ రైటర్ గా వర్క్ చేసిన మణిబాబు కరణం అందించిన సీన్ లని రీ షూట్ చేసినట్టుగా తెలుస్తోంది.
రవితేజ ఆ సీన్ లపై అభ్యంతరం చెప్పడం వల్లే దర్శకుడు త్రినాథరావు నక్కిన కొత్త రైటర్ తో మళ్లీ రాయించి రీ షూట్ చేశారట. ఫైనల్ గా రీ షూట్ చేసిన సీన్ లని చూసుకున్న రవితేజ ఓకే అని సంతృప్తిని వ్యక్తం చేశాడని తెలుస్తోంది. రీ షూట్ చేసి ఖర్చు కారణంగా ముందు అనుకున్న బడ్జెట్ కూడా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 23న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.