Begin typing your search above and press return to search.
మా అబ్బాయి సీన్లు ఇంకా చూడలేదు
By: Tupaki Desk | 16 Oct 2017 6:15 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఒక్క అపజయం రాగానే చాలా నిరాశ చెందుతున్నారు. కానీ మాస్ మహారాజ రవి తేజ మాత్రం జయాపజయాలను లెక్క చేయకుండా సినిమాలను చేస్తారు. రెండేళ్ల క్రితం ఆయన ఎంత బిజీగా ఉండేవారో తెలిసిన విషయమే. అయితే గత ఏడాది రవితేజ సినిమా రిలీజ్ కాలేదు. ఎవరు ఊహించని విధంగా బ్లైండ్ క్యారెక్టర్ లో రాజా ది గ్రేట్ అనే సినిమాతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్బంగా రవి తేజ కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
రవితేజా మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల తర్వాత తన సినిమా రిలీజ్ కావడానికి కారణం నాకు తెలియదు అలా జరిగిపోయింది. అదే విధంగా కొత్త తరహా కథలు ఎంచుకోవాలని అనుకుంటున్నా. ఇక ఇప్పటి నుండి ఏడాదికి రెండు సినిమాలను చేస్తాను. అదే విధంగా కథలో కూడా కొంచెం కొత్తదనం ఉండేట్లు చూసుకుంటాను. ఎందుకంటే సినిమా కొత్తగా లేకపోతే ప్రేక్షకులు చూడటం లేదు. రాజా ది గ్రేట్ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా అని మాస్ రాజా తెలిపాడు.
ఇక సినిమాలో క్యారెక్టర్ బ్లైండ్ కదా..సినిమా ఒప్పుకున్నపుడు అభిమానులు గుర్తుకురాలేదా అంటే రవితేజా ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చారు. గుర్తొచ్చారు కానీ దర్శకుడు అనిల్ రావి పూడి కథ చెప్పిన విధానం నాకు నచ్చింది. అతను కాకుండా వేరే ఎవరైనా ఈ కథ చెప్పి ఉంటె ఒప్పుకునే వాన్నీ కాదు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అలాగే అనిల్ కూడా తనకు చాలా రోజుల నుండి తెలుసనీ చెబుతూ.. మొదట పటాస్ కథను నాకే చెప్పాడు. కానీ అప్పుడు చేయడం కుదరలేదని రవితేజ చెప్పాడు.
అదే విధంగా సినిమాలో కూడా మా అబ్బాయి మహాదన్ తన చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడని చెప్పారు. అయితే ఆ సీన్స్ తాను ఇంకా చూడలేదని క్యారెక్టర్ మాత్రం సూపర్బ్ గా చేసాడని నమ్ముతున్నా.. ఎందుకంటే సినిమా అంటే వాడికి పిచ్చి. ప్రతి సినిమాను చూస్తాడని చెబుతూ.. ఎంతైనా నటుడి కొడుకు కదా అని రవితేజ నవ్వుతు చెప్పారు.