Begin typing your search above and press return to search.

వివాదం కేరాఫ్ విజ‌యేత్స‌వం

By:  Tupaki Desk   |   31 Jan 2023 7:00 AM GMT
వివాదం కేరాఫ్ విజ‌యేత్స‌వం
X
ఈ మ‌ద్య విజ‌యోత్స‌వాలు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ లుగా మారుతున్నాయి. విజ‌యానందాన్ని ఆస్వాదించే క్ర‌మంలో సీనియ‌ర్ హీరోలు చేస్తున్న కామెంట్ లు సోస‌ల్ మీడియాలో దుమారంగా మారుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. టాలీవుడ్ అగ్ర క‌థానాయకుల్లో ఒక‌రైన నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ మూవీ `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌మించారు. శృతిహాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన విష‌యం తెలిసిందే.

భారీ అంచ‌నాల మ‌ధ్య సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన ఈ మూవీ యావ‌రేజ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయినా స‌రే బాల‌య్య న‌టించిన సినిమాల్లో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం హైద‌రాబాద్ లో విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం తెలిసిందే. ఈ ఈవెంట‌లో పాల్గొన్న బాల‌య్య స‌ర‌దాగా మాట్లాడుతూ ఆ రంగారావు..ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే సృష్టించాయి.

బాల‌య్య‌పై నెటిజ‌న్ లు, అక్కినేని హీరోలు, ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేష‌న్ తో పాటు కాపు నాడు కూడా ఫైర్ అయ్యేదాకా వెళ్లింది. త‌ను చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మార‌డంతో బాల‌య్య ఫైన‌ల్ గా స్పందించారు. తాను ఫ్లోలో అన్నాన‌ని, త‌న వ్యాఖ్య‌ల్లో ఎలాంటి చెడు వుద్దేశ్యం లేద‌ని, అక్కినేనిని తాను బాబాయ్ అంటూ ప్రేమ‌గా పిలుచుకుంటాన‌ని వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. దీంతో వివాదం స‌ద్దుమ‌నిగింది.

ఇక ఇదే సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌` కూడా సంక్రాంతికే విడుద‌లైంది. చాలా రోజుల త‌రువాత వింటేజ్ చిరుని ఈ మూవీలో చూపించ‌డం, మాస్ మ‌హారాజా ర‌వతేజ ప‌వ‌ర్‌ ఫుల్ రోల్ లో క‌నిపించ‌డంతో సినిమా అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించింది. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైన ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా 200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి చిరు సినిమాల్లో రికార్డుగా నిలిచింది.

ఈ నేప‌త్యంలో చిత్ర బృందం హ‌న్మ‌కొండ‌లో `వాల్తేరు వీర‌య్య‌` విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ విజ‌యేత్స‌వంలో హుషారుగా క‌నిపించిన మెగాస్టార్ చిరంజీవి ఈ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు మాస్ రాజా ర‌వితేజ అభిమానుల్ని అసంతృప్తికి గురి చేశాయ‌ట‌. `ర‌వితేజ వాల్ పోస్ట‌ర్ సీన్ లో లుంగీతో బుర‌ద‌ను తుడిచి ముద్దు పెట్టా. లుంగీతో తుడ‌వ‌టం వ‌ర‌కే డైరెక్ట‌ర్ అనుకున్నాడు. అయితే ఆ సీన్ లో నేను పోస్ట‌ర్ కు ముద్దు పెడ‌తాన‌ని వారు ఊహించ‌లేదు.

ఏ పెద్ద హీరో చిన్న హీరోకు ముద్దు పెట్టి ఎలివేట్ చేయ‌ర‌ని బాబీ చెప్పాడ‌ని ఈ సంద‌ర్భంగా చిరు చెప్పుకొచ్చారు. అంటే ర‌వితేజ‌ను చిన్న హీరో అంటున్నారా? అంటూ నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. ఇలా ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల విజ‌యోత్స‌వ వేడుక‌లు ఇలా వివాదాల‌కు తెర తీయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.