Begin typing your search above and press return to search.

రామారావు డైరెక్టర్ ఎక్కడ..?

By:  Tupaki Desk   |   1 Aug 2022 12:30 PM GMT
రామారావు డైరెక్టర్ ఎక్కడ..?
X
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న మాస్ మహారాజా రవితేజ.. కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ కు కూడా మళ్లీ అవకాశం ఇవ్వడం రవితేజకే చెల్లింది. అయితే వారిలో కొందరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.

'వీర' వంటి పరాజయం తర్వాత కూడా 'ఖిలాడి' సినిమాతో డైరెక్టర్ రమేష్ వర్మ కు అవకాశం ఇచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ వెంటనే 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో శరత్ మండవ కు ఛాన్స్ ఇచ్చాడు మాస్ రాజా. కానీ దర్శకుడు రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

శరత్ మండవ గతంలో 'బ్రోకర్' 'తులసీదళం' వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా.. 'పోటుగాడు' 'ఎవడూ తక్కువ కాదు' వంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రంతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

రామారావు ప్లాప్ విషయంలో రవితేజ అభిమానులు దర్శకుడు శరత్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పి, రొటీన్ కథనం - బోరింగ్ స్క్రీన్ ప్లే తో నీరసమైన సినిమా తీసాడని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర దూషణలతో విరుచుకుపడుతున్నారు.

నిజానికి సినిమా విడుదలకు ముందు అన్ని ప్రచార ఇంటర్వ్యూలలో శరత్ ఫుల్ కాన్ఫిడెంట్ గా 'రామారావు' హిట్ అవుతుందనే విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ట్విట్టర్ లో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి నెటిజన్లు మరియు విమర్శకులపై కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు కూడా చేసాడు. కానీ రిలీజ్ తర్వాత ఇలాంటి సినిమాకు ఎలాంటి రివ్యూలు ఇవ్వాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ముఖ్యంగా మాస్ మహారాజా అభిమానులు 'రామారావు ఆన్ డ్యూటీ' విషయంలో ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. దర్శకుడు శరత్ మండవ పై మండిపడుతున్నారు. కొన్నాళ్లపాటు అతను బయట కనిపించకుండా ఉంటే బెటర్ అని మీడియా ముఖంగా సీరియస్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్ ట్రోల్స్ ను తప్పించుకోడానికి శరత్ మండవ తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం అతను అంగీకరించిన ఫాలోవర్స్ కు మాత్రమే ప్రొఫైల్ మరియు ట్వీట్స్ కనిపించేలా ప్రొటెక్షన్ పెట్టుకున్నారు.

సినిమా ఇండస్ట్రీలో పరాజయాలు అనేవి సర్వసాధారణం. 'ఖిలాడి' పరాజయం చెందిన తర్వాత రమేష్ వర్మ ను ఈ రేంజ్ లో రవితేజ ఫ్యాన్స్ విమర్శించలేదు. కానీ 'రామారావు ఆన్ డ్యూటీ' పై భారీ అంచనాలు కలిగేలా చేసి.. ఉసూరమనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అందుకే శరత్ పై ఇంతలా ఫైర్ అవుతున్నారు.

అయితే గతంలో 'షాక్' ఇచ్చిన హరీష్ శంకర్ కు ఛాన్స్ ఇచ్చి 'మిరపకాయ్' వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు రవితేజ. మరి ఇప్పుడు రామారావు దర్శకుడి కూడా మరో అవకాశం ఇచ్చి సక్సెస్ అందుకుంటారేమో ఎవరికి తెలుసు. ఏదేమైనా ఇప్పుడైతే శరత్ పై మాస్ రాజా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. మరి దర్శకుడు దీన్ని ఎదుర్కొని స్ట్రాంగ్ గా బౌన్స్‌ బ్యాక్ అవుతాడేమో చూడాలి.