Begin typing your search above and press return to search.
మాస్ మహారాజ్ కంబ్యాక్ సాధ్యమేనా?
By: Tupaki Desk | 24 Jan 2020 2:30 AM GMTమాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బందికర సన్నివేశంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రయోగాలు చేసినా.. కమర్షియల్ ఎటెంప్ట్ చేసినా.. ఎందుకనో ఆడియెన్ కి కనెక్టవ్వలేకపోయాడు. రాజాలో రొటీనిటీకి జనం విసుగు చెందారన్న విమర్శలు వచ్చాయి. అయితే అన్నిటినీ సరి చేసుకునేందుకే అతడు వీ.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ప్రయోగాత్మక కథాంశానికి ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ మూవీ `డిస్కో రాజా` నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఇది రవితేజకు ఆశించిన విజయాన్ని అందిస్తుందా? రిజల్ట్ ఎలా ఉండనుంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
ఈ సినిమాలో రవితేజ పాత్ర తీరుతెన్నులు ఆసక్తికరం. అతడు ఓ మ్యూజికల్ గ్యాంగ్ స్టర్ గా నటించారు. 1980 బ్యాక్ డ్రాప్ .. నాటి వాతావరణం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇక ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ .. ట్రైలర్ .. పోస్టర్ ప్రతిదీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రవితేజ క్యారెక్టరైజేషన్ రొటీన్ కి భిన్నంగా కాస్త అవేగా ఉందన్న టాక్ వినిపించింది. ఈసారి కూడా వీఐ ఆనంద్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారన్న ప్రశంసలు దక్కాయి. రవితేజ ఈ సినిమా కోసం రేయింబవళ్లు కఠోరంగా శ్రమించారు. డిస్కోరాజా సెట్స్ లో ఉండగా వేరొక సినిమా గురించి ప్రస్థావన కూడా చేయలేదంటే ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి పని చేశాడో అర్థం చేసుకోవచ్చు.
డిస్కో రాజా అంటూ టైటిల్ వేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంతో ఇంతో రవితేజ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైనా వీకెండ్ కలెక్షన్స్ ని పుల్ చేయాలంటే స్టూడెంట్స్ యూత్ ని థియేటర్లకు రప్పించాలి. అయితే ఇప్పటికే పండగ సెలవులు అయిపోయాయి. మరి ఆ పని చేయగలుగుతాడా? లేదా? అన్నది చూడాలి. మరికాసేపట్లో డిస్కో రాజా ఎక్స్ క్లూజివ్ రివ్యూ కోసం వేచి చూడండి.