Begin typing your search above and press return to search.

మాస్ రాజాలో మార్పోచ్చింద‌నిపిస్తారా?

By:  Tupaki Desk   |   2 April 2023 10:27 AM GMT
మాస్ రాజాలో మార్పోచ్చింద‌నిపిస్తారా?
X
ఇటీవ‌లే మాస్ రాజా ర‌వితేజ మ‌ళ్లీ `ధ‌మాకా` స‌క్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ` క్రాక్` స‌క్సెస్ తో కేక పెట్టించినా అటు పై రెండు చిత్రాలు తీవ్ర నిరాశ‌ని మిగిల్చాయి. ఇదే కొన‌సాగిస్తే మ‌ళ్లీ పంథా పాత‌దే అవుతుంది అన్న విమ‌ర్శ‌లు అంతే జోరుగా వైర‌ల్ అయ్యాయి. ల‌క్కీగా `ధ‌మాకా` స‌క్స‌స్ తో ఆ బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. వ‌సూళ్ల ప‌రంగా స‌క్సెస్ సాధించినా? మాస్ రాజాలో పాత్ర‌ల ప‌రంగా ఎలాంటి మార్పు రాలేద‌న్న‌ది అంతే వాస్త‌వం.

ఆయ‌న ఇంకా పాత్ర‌ల ఎంపిక ప‌రంగా మూస‌ధోర‌ణిలోనే కొన‌సాగుతున్నారు అని చాలా కాలంగా వినిపిస్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌. క‌మ‌ర్శియ‌ల్ స్టార్ అవ్వ‌డానికి ఆ నేప‌థ్యం గ‌ల సినిమాలు స‌హ‌క‌రించినా ఇప్పుడు ట్రెండ్ మారిన త‌రుణం. హీరోలంతా కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తున్నారు. కానీ రాజా మాత్రం ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాల‌కు ఇప్ప‌టికీ దూరంగా ఉంటున్నార‌ని చాలా కాలంగా వినిపిస్తున్న‌దే.

ఒకే జోన‌ర్ చిత్రాలు చేయ‌డం.. పాత్ర‌ల ప‌రంగా ఎలాంటి ఛేంజోవ‌ర్ లేక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. మ‌రి వీట‌న్నింటిని `రావ‌ణాసూర` చెక్ పెబుతుందా? మాస్ రాజాకి ఈ సినిమా కొత్త ఇమేజ్ ని తీసుకొస్తుందా? అంటే అవున‌నే ధీమా వ్య‌క్తం చేస్తుంది యూనిట్. ఈ సినిమాకి ప‌నిచేసిన టీ మ్ అంతా కొత్త‌వారు. ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో రాణిస్తున్నారు. `రావ‌ణాసుర‌`కి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

`పుష` సినిమాకు ప‌నిచేసిన ర‌చ‌యిత శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు ర‌చ‌న చేసారు. ఇద్ద‌రు ఇన్నోవేటివ్ గా రాయ‌గ‌ల‌వారే. ద‌ర్శ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ట్రాక్ బాగుంది. రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జంతోనే శెభాష్ అనిపించు కున్నాడు. `పుష్ప` స‌క్సెస్ తో ర‌చ‌యిగా శ్రీకాంత్ కి మంచి పేరొచ్చింది. దీంతో ఆ ఇద్ద‌రు ర‌వితేజ లో భారీ మార్పు తీసుకొస్తార‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాకి పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. నిన్న‌టి రోజున టీమ్ అంతా తెర‌పై కొత్త రవితేజ‌ని చూస్తార‌ని? అంతా ధీమా వ్య‌క్తం చేసారు. ఆయ‌న పాత్ర ప‌రంగా ఛేంజోవ‌ర్ క‌నిపిస్తుంది! అన్న కాన్పిడెన్స్ అభిమానుల్లోనూ బ‌లంగా క‌నిపిస్తుంది. మ‌రి రాజాలో మార్పు ఏ మేర చేస్తున్నారో? చూడాలి. ఈనెల 7న సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.