Begin typing your search above and press return to search.
క్లాస్ వాళ్లు కూడా విజిల్స్ వేస్తారు - మాస్ మహారాజా రవితేజ
By: Tupaki Desk | 22 May 2018 9:49 AM GMTస్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మాదిరిగా ఒక్కో మెట్టు పైకెక్కుతూ తెలుగు సినీ ప్రేక్షకుల్లో మాస్ మహరాజ్ అయిపోయాడు యనర్జిటిక్ స్టార్ రవితేజ. రాజా ది గ్రేట్ తో సూపర్ హిట్ కొట్టి మరో బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ అందులో భాగంగా నేలటిక్కెట్ అనే మాస్ ఎంటర్ టైనర్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఈ మాస్ రాజా తో తుపాకీ రీడర్స్ కోసం ఓ స్పెషల్ చిట్ చాట్....
* నేలటిక్కెట్ కి క్లాస్ టిక్కెట్ కి మధ్య దూరం చాలా ఉంటుంది. మరి ఈ నేల టిక్కెట్ కథ క్లాస్ ని ఏ రేంజ్ లో అలరించగలదంటారు?
నేలటిక్కెట్ అనే కాదు అది ఏ సినిమా అయినా కథలో కంటెంట్ ఉంటే ఆ సినిమా నేలటిక్కెట్ నుంచి క్లాస్ వరుకు అందరీకి నచ్చుతుంది. నేలలో ఉంటే వాళ్లే కాదు క్లాస్ లో కుర్చునే వాళ్లు కూడా ఈలలు వేయలనుకుంటారు. కానీ చుట్టూ చూసి ఆగుతుంటారంటే. కథలో ఉంటే కంటెంట్ అది ఇచ్చే ఎమోషన్ అందరికీ ఒక మాదిరిగానే కనెక్ట్ అవుతోంది. మా నేలటిక్కెట్ స్టోరీ కూడా అందరీకి కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను.
* నేలటిక్కెట్ తీసుకొని సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయా?
కోకొల్లలు - మీరు కూడా చూసుంటారు కదా, నాకు తెలిసి మనలో చాలా మందికి నేలటిక్కెట్ లో సినిమా చూసిన అనుభవం ఉంటుంది. చిన్న లాజిక్ ఏంటంటే - క్లాస్ లో కుర్చొని సినిమా చూస్తే కేవలం ఒక సినిమా మాత్రమే చూడగలం - అదే నేలటిక్కెట్ లో అయితే నాలుగు సినిమాలు చూడోచ్చు. నేనైతే అదే చేసేవాడిని. సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తున్న టైమ్ లో రూపాయి పది పైసలు పెట్టి నెలటిక్కెట్ కొనే సినిమాలు చూసే వాడిని. నాకు ఇప్పటికీ ఆ రేట్లు గుర్తున్నాయి. ఏసి నేల టిక్కెట్ అయితే రూపాయి పది పైసలు - నాన్ ఏసి అయితే తొంబై పైసలు ఉండేది.
* నేలటిక్కెట్ కథను ఓకే చేయడానికి రీజన్ ఏంటి?
ఇదేం కొత్త కథ కాదు. కొత్త కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. పాత కథలకే కొత్త ట్రిట్ మెంట్స్ ఇచ్చి కొత్త సినిమాలుగా తీస్తున్నారు. నేను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నా కాబట్టి ఇదేదో కొత్త కథ అని చెప్పను. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రాసుకున్న సన్నివేశాలు - స్క్రీన్ ప్లే అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారనిపిస్తోంది. ఫస్ట్ కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. టోటల్ గా ఈ సినిమా ఓ ఫుల్ మీల్స్ లా అనిపించి నటించాను.
* నేలటిక్కెట్ మేకర్స్ తో మరో సినిమా కమిటైయ్యారట నిజమేనా?
నేలటిక్కెట్ ప్రొడ్యూసర్ రామ్ గారు డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదనిపించింది. ఎందుకంటే ఆల్రేడీ రామ్ గారు బయట బిజనెస్ లు చేసి బాగానే సంసాదించారు. మంచి సినిమాలు తియ్యాలనే ప్యాషన్ తో రామ్ గారు ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా ఉద్దేశంతో వచ్చిన ఎవరనైనా నేను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాను. రామ్ బ్యానర్ లో మరో సినిమా కమిటైయ్యాను. దానికి సంబంధించిన డిటైల్స్ త్వరలోనే ప్రకటిస్తారు.
* ఒకసారి ఫుల్ స్పీడ్ మధ్యలో ఫుల్ బ్రేక్ మళ్లీ ఇప్పుడు ఫుల్ స్పీడ్ ఎందుకలా?
నాకున్న ముఖ్యమైన పని సినిమా... కథలు బావుండి అన్ని కుదిరితే త్వరత్వరగా సినిమాలు చేస్తుంటాను. అప్పట్లో అదే జరిగింది. ఆ తరువాత నాకు సరిపడ్డ కథలు రాలేదు. దీనితో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వరుసగా మంచి కథలు వస్తున్నాయి. వరుసపెట్టి లాగించేస్తున్నాను. నేలటిక్కెట్ తరువాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో నటిస్తున్నా - మరోవైపున థేరీ రీమేక్ చేస్తున్నా. ఈ రెండు ఇప్పుడు సెట్స్ మీదున్నాయి. మరో రెండు స్టోరీలు ఓకే చేశాను.
* రీమేక్ లు చేయడం ఇప్పుడు రిస్క్ అనిపించడంలేదా?
గతంలో రీమేక్ చేసి కాస్త తడబడ్డాను. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయడం లేదు. దాదాపు 70 శాతం కథను మార్చి థేరీ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాం. థేరీ ఒరిజనల్ వెర్షన్ చూసినవాళ్లు కూడా మా రీమేక్ చూసి కొత్తగా ట్రై చేశాం అనుకుంటారు కానీ ఏ మాత్రం బోర్ ఫీల్ అవ్వరు.
* పవన్ కళ్యాణ్ మీతో ఉన్న వీడియో వైరల్ అయింది అప్పుడు అసలు ఏం జరిగింది?
అడగాలని అడగటం కాదు కానీ అక్కడేం జరిగిందో మీకు తెలుసు. నా పక్కన కుర్చొన్న పవన్ సరదాగా నేను వేసుకున్న టోన్డ్ జీన్స్ కి ఉన్న దారాలన్ని లాగాడు. అదే క్యాప్చర్ అయింది ఆ తరువాత వైరల్ అయింది. పవన్ తో ఫ్రెండ్ షిప్ అలానే ఉంటుంది. మేమిద్దరం కలిస్తే నవ్వులే నవ్వులు. ఎంతో బిజీగా ఉండి కూడా మా సినిమా ఫంక్షన్ కి వచ్చినందుకు పవన్ కి మరోసారి థ్యాంక్స్
* అన్నీ కుదిరుంటే కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమా ఇదే అవునట నిజమేనా?
సోగ్గాడు కంటే ముందే కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా స్టోరీ వినిపించాడు నాకు. కానీ అ టైమ్ లో నాకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఈ సినిమా చేయలేకపోయాను. కళ్యాణ్ ను పిలిచి వేరే ఆఫర్స్ వస్తే చేసుకో కానీ కచ్ఛితంగా ఈ సినిమా చేస్తున్నాం అని మాటిచ్చాను. ఇదిగో ఇప్పుడు ఇలా నేలటిక్కెట్ రెడీ అయింది. కళ్యాణ్ లో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ నచ్చే ఈ ఆఫర్ ఇచ్చాను. ముఖ్యంగా ఈ జర్నీలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఈ సినిమాతో కళ్యాణ్ హ్యట్రిక్ అందుకుంటాడని ఆశిస్తున్నా. అలానే ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక - సంగీతం ఇచ్చిన శక్తి కాంత్ ఇంకా మిగతా టెక్నీషియన్లు - ఆర్టిస్టులు మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇక రిజల్ట్ కోసం వెయిటింగ్.