Begin typing your search above and press return to search.

డిజాస్టర్.. ఆ నమ్మకం ఏంటి రాజా?

By:  Tupaki Desk   |   14 April 2023 8:00 PM GMT
డిజాస్టర్.. ఆ నమ్మకం ఏంటి రాజా?
X
కొంత మంది హీరోలు దర్శకుల కంటే రైటర్ ని ఎక్కువగా నమ్ముతారు. అలాగే వారి కథలని బలంగా విశ్వసిస్తారు. ఈ కారణంగానే రచయితలని హీరోలు తమ దగ్గర పెట్టుకొని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు. వారి కథతో ఇంకో దర్శకుడితో సినిమాలు చేస్తారు.

అయితే ఇలా చేసే క్రమంలో ఒక్కో సారి ఫెయిల్ అయినా కూడా డైరెక్టర్ సినిమాని పెజెంట్ చేయడంలో లోపం ఉందనే భావిస్తారు తప్ప రైటర్ ఇచ్చి కథతో సమస్య లేదని నమ్ముతారు.

అందుకే ఫ్లాప్ లు వచ్చిన ఆ రచయితలని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు రవితేజ కూడా అలాగే శ్రీకాంత్ విస్సా అనే రైటర్ ని ప్రోత్సహిస్తున్నారు. రవితేజకి ఖిలాడీ మూవీ కథని ఈ రైటర్ అందించాడు. సినిమా ప్రమోషన్ లో రైటర్ పై మాస్ రాజా ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కథని అందించారని అన్నారు. అయితే రిలీజ్ తర్వాత ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.

అయితే మళ్ళీ శ్రీకాంత్ చెప్పిన రావణాసుర కథ నచ్చడంతో సుదీర్ వర్మని పిలిచి ఆ కథ బాద్యతలని రవితేజ అప్పగించారు. ఇక సుదీర్ వర్మ కూడా కథని పెర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించారు. మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఎందుకనో లాంగ్ రన్ లో ప్రేక్షకులకి మాత్రం కనెక్ట్ కాలేదు. దీంతో ఇప్పుడు రావణాసుర మూవీ కూడా డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా రవితేజ రైటర్ టాలెంట్ పై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కథని తనకి అందించారని అన్నారు. అయితే శ్రీకాంత్ విస్సా మాత్రం రెండు సార్లు రవితేజకి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇవ్వడం విశేషం. బాసంతి సినిమాతో డైలాగ్ రైటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీకాంత్ విస్సా తరువాత రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీకి కథ అందించాడు.

ఆ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు భళా తందనాన అనే మూవీకి స్టొరీ అందించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తాజాగా ఖిలాడీ, రావణాసుర మూవీతో మరో రెండు డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఇతని నుంచి కళ్యాణ్ రామ్ డెవిల్, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రాబోతున్నాయి. టైగర్ మూవీతో అయిన రవితేజకి శ్రీకాంత్ హిట్ ఇస్తాడేమో చూడాలి.