Begin typing your search above and press return to search.
సుధీర్ వర్మ వర్కింగ్ స్టైల్ మెచ్చి మరో ఛాన్స్ ఇస్తున్న మాస్ రాజా..?
By: Tupaki Desk | 8 Sep 2022 4:30 AM GMT'స్వామిరారా' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ వర్మ.. వైవిధ్యమైన స్టోరీలు - విభిన్నమైన స్క్రీన్ ప్లేకు పేరుగాంచారు. విలక్షణమైన మేకింగ్ స్టైల్ తో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినిమా హిట్టా ప్లాపా అనేది పక్కన పెడితే.. సుధీర్ వర్మ ఎల్లప్పుడూ నిర్మాతల దర్శకుడు అనిపించుకున్నాడు. సినిమాని అనుకున్న బడ్జెట్ లో ప్లాన్ చేసిన దానికంటే ఫాస్ట్ గా ఫినిష్ చేస్తుంటాడనే మంచి పేరుంది.
అంతేకాదు సుధీర్ వర్మ సినిమా రిలీజ్ కు ముందే ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంటాడని ఇండస్ట్రీలో అంటుంటారు. ఈ కారణంగానే ప్రతీ నిర్మాత కూడా అతనితో వర్క్ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటాడు. అందుకే సుధీర్ కు ఇప్పటి వరకు అవకాశాలకు లోటు లేదు.
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా ''రావణాసుర'' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో ఆసక్తికరమైన కథనంలో కొన్ని ఊహించని ట్విస్టులతో ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించడబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే సుధీర్ వర్మ వర్కింగ్ స్టైల్ తో ఇంప్రెస్ అయిన రవితేజ.. వెంటనే దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు.
రవితేజతో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేసిన సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారట. ఈ ఏడాదిలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రవితేజ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత సుధీర్ వర్మతో మరోసారి కలిసి పని చేయనున్నారని తెలుస్తోంది.
రవితేజ ప్రస్తుతం 'రావణాసుర' సినిమాతో పాటుగా 'ధమాకా' 'టైగర్ నాగేశ్వరరావు' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదే పూర్తవుతాయి. ఇదే క్రమంలో కార్తీక్ ఘట్టమనేని - శ్రీవాస్ - సుధీర్ వర్మ లతో మాస్ రాజా వర్క్ చేయనున్నారు. వచ్చే ఈ ఏడాది ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.