Begin typing your search above and press return to search.

ఖిలాడీ వ‌ర్సెస్ డైరెక్ట‌ర్! ఇంత‌కీ అస‌లేమైంది!?

By:  Tupaki Desk   |   13 Feb 2022 5:54 AM GMT
ఖిలాడీ వ‌ర్సెస్ డైరెక్ట‌ర్! ఇంత‌కీ అస‌లేమైంది!?
X
మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ ఈ శుక్ర‌వారం విడుదలైంది. మిశ్ర‌మ స్పంద‌న‌ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా తేలిపోయింద‌న్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు రమేష్ వ‌ర్మ‌తో ర‌వితేజ‌కు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో పొస‌గ‌లేద‌ని గుస‌గుస‌లు కూడా ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఖిలాడీలో ర‌వితేజ న‌ట‌న‌.. మాస్ అంశాలు .. ఇద్ద‌రు నాయిక‌ల గ్లామ‌ర్ ఎలివేష‌న్ అంశాలు మాస్ కి న‌చ్చుతాయ‌ని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఇక‌ ఏది ఏమైనా అంతిమ ఫ‌లితం ఏమిట‌న్న‌ది కాస్త వేచి చూడాలి.

ఇంత‌లోనే ఈ సినిమా వివాదంలోకి రావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ప్ర‌ముఖ‌ నిర్మాత రతన్ జైన్ ఖిలాడీ-తెలుగు నిర్మాతలపై కేసు దాఖలు చేయడంతో చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. `ఖిలాడీ` అనే టైటిల్ పూర్తిగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 హిందీ చిత్రానికి చెందిన రైట్ అని ఆయన ఆరోపించారు. OTT లు ఇతర ప్లాట్ ఫారమ్ లలో తెలుగు ఖిలాడీ విడుదలను నిలిపివేయాలని రతన్ జైన్ కోర్టును అభ్యర్థించారు.

రవితేజ ఖిలాడి నిర్మాతలు ట్రేడ్ మార్క్ చట్టం కింద అతని వద్ద రిజిస్టర్ అయ్యి ఉన్నందున టైటిల్ ను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎలాంటి ఆర్థిక నష్టపరిహారం కోసం చూడడం లేదని కేవలం `ఖిలాడీ` సినిమాల ఖ్యాతి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నానని జైన్ తెలిపారు. సౌత్ ఇండియా సినిమాల టైటిళ్ల‌ను స్థానిక అసోసియేషన్ లలో రిజిస్టర్ చేసి.. హిందీలో కూడా అదే టైటిల్ తో విడుదల చేయ‌డం స‌రికాద‌ని ఆయన ఆరోపించారు.

హిందీ చిత్రాల తరహా టైటిల్స్ తో డబ్బింగ్ చిత్రాలను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సీబీఎఫ్ సి అనుమతించినందున ఇది జరుగుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం ఇలా ఉండేది కాదు! అని రతన్ జైన్ అన్నారు.

దక్షిణాదిలో ఖిలాడీ అనే సినిమా రూపొందుతోందన్న విషయం తనకు పూర్తిగా తెలియదని ఆయ‌న‌ అన్నారు. కొద్దిరోజుల క్రితం ట్రైలర్‌ విడుదలైనప్పుడే త‌న‌కు తెలిసింద‌ట‌. తన టైటిల్ ని ఎవరో వాడుకుంటున్నారని గ్రహించిన వెంటనే జైన్ కోర్టును ఆశ్రయించాడు. రిలీజ్ ని ఆపడానికి చాలా ఆలస్యమైందని మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు.

సినిమా థియేటర్లలో విడుదల కాకుండా OTT ఇతర ప్లాట్ ఫారమ్ లలో నిలిపివేయాలని తాను ప్లాన్ చేయడం లేదని జైన్ చెప్పారు. హిందీ మార్కెట్ లో సినిమా విడుదల గురించి కూడా తనకు చెప్పలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు రవితేజ ఖిలాడీ నిర్మాతలు ఈ విషయంపై స్పందించలేదు. మునుముందు వారి నుంచి స్పంద‌న ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ద‌ర్శ‌కుడితో ఏంటి త‌క‌రారు?

ఖిలాడీ రిజ‌ల్ట్ ని మాస్ మ‌హారాజా ర‌వితేజ ముందే ఊహించాడా? అంటే అవున‌నే గుస‌గుస వినిపిస్తోంది. ఆయ‌న‌కు ఈ సినిమా కంటెంట్ షేప‌ప్ అయిన విధానం న‌చ్చ‌లేద‌ని ఇంత‌కుముందు ఆడియో వేదిక సాక్షిగా ద‌ర్శ‌కుడిపై సెటైర్లు నిరూపించాయి. ఖిలాడీలో మాస్ ఎలిమెంట్స్ కి కొద‌వేమీ లేదు. అలాగే ఇటీవలి కాలంలో అత్యంత ప్రముఖ తారలను ఎంపిక చేసుకున్నారు. సచిన్ కేద్కర్- రావు రమేష్- అర్జున్- ముఖేష్ రిషి- ఉన్ని ముకుందన్- అనసూయ వంటి పెద్ద స్టార్లు ఉన్నారు.

నిర్మాత భారీ పెట్టుబ‌డుల‌తో విజువ‌ల్ గా అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమాలోని ప్రతి ఫ్రేములో రిచ్ నెస్ క‌నిపించింది. ఈ చిత్రంలో ఇద్దరు యువ కథానాయికలు వేడెక్కించే గ్లామ‌ర్ తో క‌వ్వించారు. డింపుల్ హయాతి - మీనాక్షి చౌదరిల‌కు ఆర‌బోత‌కు ఎటువంటి అభ్యంత‌రాల్లేవ‌ని నిరూప‌ణ అయ్యింది.

అన్నీ బాగానే ఉన్నా అల్లుడి నోట‌.. అన్న చందంగా అయ్యిందనేది ఇప్పుడు గుస‌గుస‌. సినిమాలో స్క్రీన్ ప్లే ఫెయిలైంది. క‌థ‌ను ఒక బాణిలో చ ఊపించ‌లేక‌పోయారని విమ‌ర్శ‌లొచ్చాయి. దర్శకుడు కేవలం గ్లామర్ ఎలివేష‌న్ పైనే పూర్తిగా దృష్టి సారించి అవ‌స‌ర‌మైన దానిని విస్మరించాడు. సినిమాలో రవితేజతో చాలా డబుల్ మీనింగ్ డైలాగులు ప‌లికించారు.

ఇక ప్రీ రిలీజ్ వేదిక‌పై రవితేజ ఛ‌మ‌త్కార‌మైన సంభాష‌ణ ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. దర్శకుడి విష‌యంలో రాజాకు క‌ల‌త‌లున్నాయ‌ని అర్థ‌మైంది. ర‌మేష్ వ‌ర్మ తీరుపై విసుగు చెందడం క‌నిపించింది. ప్రీరిలీజ్ అనంత‌రం సోష‌ల్ మీడియా వార్ గురించి తెలిసిందే. ఏది ఏమైనా ర‌వితేజ‌ పూర్తిగా నిరాశ‌గా కనిపించారు ఆ వేదిక‌పై. అత‌డు దర్శకుడిని పెద్దగా టార్గెట్ చేశాడు. దీన‌ర్థం రిజ‌ల్ట్ అతడు ముందే ఊహించిన‌దే.

రమేష్ వర్మ ఇప్పటికే రవితేజకి 2011లో `వీర`తో డిజాస్టర్ అందించాడు. ఒక దశాబ్దం తర్వాత రవితేజ నుండి మరో అవకాశం అందుకుని ఇప్పుడు మ‌రో పెద్ద పరాజయాన్ని అందించాడు. అందుకే ఆరోజు ర‌వితేజ అంత‌గా సెటైర్లు వేశార‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది.