Begin typing your search above and press return to search.

రాజాతో వైట్ల ఓకే అనిపించుకున్నాడహో

By:  Tupaki Desk   |   20 Jun 2017 3:45 AM GMT
రాజాతో వైట్ల ఓకే అనిపించుకున్నాడహో
X
కొంత కాలం క్రితం వరకు శ్రీను వైట్ల అన్న పేరే ఓ బ్రాండ్. టాలీవుడ్ దర్శకుల్లో తనదంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకున్న ఈ డైరెక్టర్.. ఆడియన్స్ ను మెప్పించడంలో వరుసగా సక్సెస్ అయ్యాడు. స్టార్ డైరెక్టర్ గా భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడు. కానీ మహేష్ తో ఆగడు మూవీ ఫ్లాప్ దగ్గర నుంచి ఈయన పరిస్థితి తారుమారయింది. రామ్ చరణ్ తో తీసిన బ్రూస్ లీ కూడా బోల్తా కొట్టేయడంతో.. కొంత దిగి వచ్చి వరుణ్ తేజ్ తో మిస్టర్ చేశాడు వైట్ల.

సమ్మర్ లో వచ్చిన మిస్టర్ కూడా వైట్ల ఆశలు నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు వైట్లకు హీరోలు మొహం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ.. గతంలో ఈయన సాధించిన సక్సెస్ లు మరో అవకాశాన్ని అందించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దర్శకుడు మాస్ మహరాజ్ రవితేజకు ఓ స్టోరీ చెప్పాడట. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో నీకోసం.. వెంకీ.. దుబాయ్ శీను వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ వీరిద్దరి కలిసి ఓ సినిమాకు పని చేసే అవకాశం ఏర్పడుతోంది.

వైట్ల చెప్పిన స్టోరీకి ఓకె చెప్పిన మాస్ రాజా.. ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా సినిమా చేస్తానన్నాడట. రవితేజ ఓకే అంటే.. తాము కూడా సిద్ధమేనంటూ ఓ బడా నిర్మాణ సంస్థ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్క్రిప్ట్ కు ఫైనల్ వెర్షన్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు శ్రీను వైట్ల. అన్నీ సవ్యంగా జరిగితే.. అక్టోబర్ చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/