Begin typing your search above and press return to search.
టచ్ లో ఇద్దరు ఉన్నారు
By: Tupaki Desk | 4 Dec 2017 4:15 AM GMTఆమధ్య వరస ఫ్లాపులతో సతమతమై కాస్త గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కెరీర్ లో తొలిసారి అంధుడి పాత్ర చేసినా తన ప్లస్ పాయింటయిన ఎంటర్ టెయిన్ మెంట్ కు లోటు లేకుండా చూసుకోవడంతో కావలసినంత కలెక్షన్లు వచ్చాయి. రాజా దిగ్రేట్ సినిమాతో పాటే రవితేజ సైన్ చేసిన చేస్తున్న టచ్ చేసి చూడు షూటింగ్ పూర్తి కావచ్చింది.
టచ్ చేసి చూడు తరవాత మాస్ మహరాజా ఏ సినిమా చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు. అతడి నిర్ణయం కోసం ఇద్దరు డైరెక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు. ఒకప్పుడు రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్లిచ్చి అతడిని మాస్ హీరో చేసిన డైరెక్టర్లలో ఒకడైన శ్రీనువైట్ల ప్రస్తుతం ఫేడవుట్ అయిపోయాడు. తనకు లైఫ్ ఇచ్చిన శ్రీను వైట్లకు లైఫ్ ఇవ్వడానికి రవితేజ రెడీ అయ్యాడు. దీంతో అతడితో సినిమా చేయడానికి శ్రీను వైట్ల సబ్జెక్టు రెడీ చేసుకున్నాడు. ఆల్రెడీ దానిని వినిపించడం కూడా పూర్తయింది. ఇదే టైంలో అక్కినేని వారింట్లో తండ్రీకొడులిద్దరికీ వరస హిట్లిచ్చిన కళ్యాణ్ కృష్ణ కూడా ఓ సబ్జెక్టు నెరేట్ చేశాడు. వీళ్లిద్దరిలో ఎవరి సినిమా ముందు మొదలెట్టేదీ రవితేజ ఇంకా నిర్ణయించుకోలేదు.
’’టచ్ చేసి చూడు షూటింగ్ కు సంబంధించి చిన్నాచితకా పనులు మిగిలున్నాయి. ఈ సినిమా పనులన్నీ పూర్తయ్యాక దీనిపై డెసిషన్ తీసుకోవాలని రవితేజ అనుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు డైరెక్టర్లు టచ్ లోనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సస్పెన్స్ విడిపోతుంది’’ అని మాస్ మహారాజా సన్నిహితుడు ఒకరు తెలిపారు. సంక్రాంతికి రిలీజవుతున్న చ్ చేసి చూడు కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరెకెక్కింది. రాశీ ఖన్నా.. సీరత్ కపూర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.