Begin typing your search above and press return to search.
ఇప్పుడు డిస్కోలెక్కడున్నాయి రాజా ?
By: Tupaki Desk | 2 Nov 2018 1:09 PM GMTమాస్ మహరాజాగా మినిమం గ్యారెంటీతో రాజ్యమేలుతున్న రవితేజకు గత మూడేళ్ళుగా టైం అట్టే కలిసిరావడం లేదు. వరస పరాజయాల నేపధ్యంలో రెండేళ్ళ దాకా గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ చేస్తే పూర్వ వైభవాన్ని మొత్తంగా తీసుకురాలేదు కాని ఇంకా మంచి మార్కెట్ ఉందని మాత్రం ప్రూవ్ చేసింది. కాని ఈ ఏడాది చేసిన టచ్ చేసి చూడు-నేల టికెట్టు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడి డిజాస్టర్లు కావడంతో రవితేజకు షాక్ లాగే ఉంది. అమర్ అక్బర్ అంటోనీ ఈ నెల 16న రానుంది. భీభత్సమైన హైప్ ఏమి లేదు కాని సడన్ సర్ప్రైజ్ లాగా దర్శకుడు శీను వైట్ల ఏదైనా స్వీట్ షాక్ ఇస్తాడెమో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక దీని తర్వాత విఐ ఆనంద్ తో ఓ సినిమా రవితేజ ఓకే చేసిన సంగతి తెలిసిందే. దీనికి డిస్కో డాన్సర్ అనే పేరు ప్రచారంలో ఉంది.
ముందు ఇది అల్లు అర్జున్ కు చెప్పిన కథ అని శిరీష్ తో ఒక్క క్షణం చేస్తున్న టైంలో బన్నీకి ఈ కథ చెప్పిన ఆనంద్ ఫైనల్ గా తనను ఒప్పించలేకపోయాడు. దానికి తోడు తమ్ముడితో తీసిన మూవీ ఫలితం నిరాశ కలిగించడంతో అల్లు అర్జున్ లైట్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అందులో హీరో పాత్ర డిస్కో డాన్సర్ కావడం వల్ల తనకైతే బాగా సూటవుతుందని ఆనంద్ ఆలోచనట. ఇప్పుడు అదే కథ ఎలాంటి మార్పులు లేకుండా రవితేజతో తెరకెక్కబోతోందని వినికిడి. నిజానికి డిస్కో డాన్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం తెలుగులో చిరంజీవి హిందిలో మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళు దీని ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు కాని ఇప్పుడు ఇది అవుట్ డేట్ అయిపోయింది. మరి పబ్బులు రాజ్యమేలుతున్న కల్చర్లో ఎప్పుడో జనం మరిచిపోయిన డిస్కో డాన్సర్ థీమ్ ని పెట్టుకోవడం ఏమిటో మొదలయ్యాక పోస్టరో టీజరో చూస్తే క్లారిటీ రావొచ్చు.