Begin typing your search above and press return to search.
అవి ఆడట్లేదు.. అందుకే చేయట్లేదు
By: Tupaki Desk | 31 Jan 2018 4:47 AM GMTరవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చేస్తోంది. మాస్ మహరాజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంలో.. రాశి ఖన్నా.. సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించారు.
బెంగాల్ టైగర్ తర్వాత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నా.. రవితేజ చేస్తున్న మూవీస్ అన్నీ ఎంటర్టెయిన్మెంట్ కాన్సెప్ట్ తోనే సాగుతున్నాయి. హీరో పాత్ర ఎలాంటిది అయినా.. మూవీ థీమ్ ఇదే ఉంటోంది. గత కొన్నేళ్లుగా ఆడియన్స్ ను అదే థీమ్ ను పలకరిస్తున్నాడు రవితేజ. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నా.. ఫన్ కి ఏ మాత్రం లోటు ఉండదని తనే చెబుతున్నాడు మాస్ మహరాజ్. అయితే.. ఇందుకు కారణం.. కొత్తగా ట్రై చేస్తే సినిమాలు ఆడట్లేదని చెబుతున్నాడు ఈ హీరో. గతంలో తాను చాలాసార్లు కొత్త కథలను ట్రై చేశానని.. అవి వర్కవుట్ కాలేదని అంటున్నాడు.
నా ఆటోగ్రాఫ్.. ఈ అబ్బాయి చాలా మంచోడు.. నేనింతే.. ఇలా తను కొత్త థీమ్ తో సినిమాలు చేస్తే అవి కమర్షియల్ గా వర్కవుట్ కాలేదన్న రవితేజ.. ఎంటర్టెయిన్మెంట్ కు ఆదరణ ఉంటోందనే ఉద్దేశ్యంతోనే అదే చేస్తున్నట్లు చెప్పాడు. కానీ గత కొంతకాలంగా జనాల మైండ్ సెట్ మారుతోందని.. ఇప్పుడు కూడా కొన్ని మంచి కథలు వస్తున్నాయని చెప్పిన రవితేజ.. అలాంటి ప్రయత్నాలు మళ్లీ చేస్తానని చెప్పడం విశేషం.