Begin typing your search above and press return to search.
మాస్ రాజా.. ఆ పాత సీన్లే రిపీట్?!
By: Tupaki Desk | 30 July 2015 8:27 AM GMTమాస్ మహారాజ్ రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో రెగ్యులర్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ, బ్రహ్మానందం తదితరులపై రామోజీ ఫిలింసిటీలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కొందరు రౌడీలు హీరోని, బ్రహ్మానందాన్ని తరుముతుంటారు. ఆ ఇద్దరు ముందు పరిగెడుతుంటే ఆ వెనకగా రౌడీలు వెంబడిస్తుంటారు. కాస్త కామెడీలు చేసి హీరో ఇరగ కొట్టేస్తుంటాడు.
ఇలాంటి సన్నివేశాలు తెలుగు సినిమాల్లో కొత్తేమీ కాదు కానీ, మాస్ రాజా బెంగాల్ టైగర్ గా ఈసారి ఫైట్స్ లో ఎలాంటి కొత్తదనాన్ని చూపిస్తాడు? అన్నదే విజయానికి కీలకం కాబోతోంది. రెగ్యులర్ తెలుగు సినిమాటిక్ పోరాట సన్నివేశాలు, రెగ్యులర్ కాప్ స్టోరీలు ఇప్పటికే తెలుగులో బోలెడన్ని వచ్చేశాయి. రొటీన్ రవితేజ స్టయిల్ కామెడీలు చూసి చూసి జనాలకు మొహం మొత్తేసింది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో సంపత్ నంది మరో కాప్ స్టోరీ ని ఎంచుకుని సినిమా తీస్తున్నాడు.
ప్రస్తుతం ఆడియెన్ మైండ్ సెట్ మారింది. రొటీనిటీని ఇష్టపడని స్థాయికి వాళ్లు ఎదిగేశారు. కథ ఎత్తుగడలోనే ఏదైనా కొత్తదనం లేకపోయినా, స్క్రీన్‌ప్లే లో వైవిధ్యం లేకపోయినా ఈసారి కష్టమేనని అంటున్నారు. ఇటీవలి కాలంలో హీరోలంతా పోలీస్ స్టోరీలమీద పడుతున్నారు కాబట్టి అవే విజువల్స్ రిపీట్ రిపీట్ అంటూ మొహం మొత్తేస్తున్నాయన్న వాదన ఉంది. అన్ని రొటీన్ సినిమాలు పవర్ లా హిట్ కొట్టేయలేవు. అది సంపత్ నంది గ్రహించాడో లేదో? వెయిట్ అండ్ సీ.