Begin typing your search above and press return to search.
రామ్ తరహాలో రాజా మిషన్!
By: Tupaki Desk | 17 Jun 2022 1:30 AM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ స్ర్కిప్ట్ ఎంపిక ప్లానింగ్ చాలా ప్రణాళికతో..పకడ్భందీగా ఉంటుంది. తనకి బాగా నచ్చిన కథల్ని ముందుగానే కొని పెట్టుకుంటాడు. ఆ విషయంలో రామ్ ఎవర్నీ ఫాలో అవ్వడు..సలహాలు తీసుకోడు. కథ నచ్చిందంటే వెంటనే కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టుకుంటాడు. ఆ తర్వాత వాటికి సంబంధించి డెవలెప్ మెంట్స్ అవసరమైతే సీనియర్ రైటర్లతో చేయిస్తుంటాడు.
రెగ్యులర్ గా డైరెక్టర్లు తన వద్దకి తెచ్చే కథలు వినడం..నచ్చితే వాటిని చేయడం ఓ పక్క యాధావిధిగా కొనసాగుతుంది. దానితో పాటే ఇలా స్ర్కిప్ట్ లు ముందుగా కొని పెట్టుకోవడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. కొన్ని పరాజయాల తర్వాత రామ్ లో వచ్చిన మార్పు ఇది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో రామ్ ఓపెన్ గానే చెప్పారు. దానికి మంచి లాజిక్ కూడా చెప్పాడు.
కథ మొత్తం నచ్చకపోయినా అందులో ఒక సోల్ కి కనెక్ట్ అయితే అది మన మంచికే అని భావించాలి. దానిపై ఇంకా బెటర్ గా వర్కౌట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్ గా వినే కథలో అలాంటి సౌలభ్యం అన్ని చోట్లా దొరకదు కదా అన్నారు. నిజానికి రామ్ లాజిక్ కొంత వరకూ వర్కౌట్ అయింది. ఇప్పుడిదే మార్గంలో మాస్ రాజా రవితేజ్ కూడా జాగ్రత్త పడుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది.
`క్రాక్` తో ట్రాక్ లోకి వచ్చిన రాజా ఒక్కసారిగా ఎలా డీలా పడ్డాడో తెలిసిందే. అప్పటి వరకూ వరుస పరాజాయలతో ఇబ్బంది పడ్డ రాజాకి `క్రాక్` సక్సెస్ ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది. కానీ ఆవెంటనే `ఖిలాడీ` రూపంలో వచ్చిన ఫెయిల్యూర్ మళ్లీ రాజాని వెనక్కి నెట్టేసింది. అలాగని అవకాశాల పరంగా గండి పడిందని కాదు. చేతిలో కొన్ని సినిమాలున్నాయి.
`రామారావు ఆన్ డ్యూటీ`..`రావణసూర`..`ధమాకా`..`టైగర్ నాగేశ్వరరావు` అన్ని సెట్స్ లో ఉన్నాయి. కానీ వాటిని జడ్జ్ చేయాల్సింది ప్రేక్షకులు. ఒకవేళ వాటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటే వెంటనే కోలుకోగలగాలి. అందుకే రవితేజ కూడా రామ్ తరహాలో నచ్చిన కథల్ని కొనేయడం మొదలు పెట్టాడుట. శ్రీకాంత్ అనే యువ రైటర్ నుంచి ఏకంగా 5 స్టోరీలు కొనుగోలు చేసాడుట.
ఇంతకీ ఎవరీ శ్రీకాంత్? అంటే `ఖిలాడీ` సినిమాకి రైటర్ గా పనిచేసిన వ్యక్తి. `ఖిలాడీ` ప్లాప్ అయినా అతని లో మంచి రైటర్ ఉన్నాడని గ్రహించి రవితేజ లిప్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లో రాజా దర్శకుడు రమేష్ వర్మకన్నా.. శ్రీకాంత్ ని ఎక్కువగా హైలైట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఐదు కథలకు సంబంధించిన డెవలెప్ మెంట్ పనులు మాత్రం కొంత మంది సీనియర్ రైటర్లకి అప్పగించినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.