Begin typing your search above and press return to search.

మళ్లీ రీమేక్‌..మ‌రో సాహ‌సం అవుతుందేమో రాజా?

By:  Tupaki Desk   |   8 March 2020 4:17 AM GMT
మళ్లీ రీమేక్‌..మ‌రో సాహ‌సం అవుతుందేమో రాజా?
X
మాస్ మ‌హారాజా రవితేజ రీమేక్ రాజాగా మారుతున్నారా? అంటే అవున‌నే తాజా సీన్ చెబుతోంది. ఇప్పటికే ఆయ‌న చాలా రీమేక్ చిత్రాల్లో నటించారు. దొంగోడు- వీడే- నా ఆటోగ్రాఫ్‌- క్షేమంగా వెళ్ళి లాభంగా రండి- తిరుమల తిరుపతి వెంకటేశా- అమ్మాయి కోసం- బడ్జెట్‌ పద్మనాభం త‌దిత‌ర‌ రీమేక్ ల‌లో నటించారు. కొన్ని హిట్లు కొన్ని ఫ‌ట్లు. అయినా రవితేజ ఇప్ప‌టికీ రీమేక్ ల‌పైనే దృష్టిసారించ‌డం ఆయ‌న అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇటీవ‌లే ర‌వితేజ న‌టించిన డిస్కో రాజా రిలీజై ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. మరోసారి మాస్ రాజా రీమేక్ లో నటించబోతున్నార‌ని తెలిసింది. గతంలో `తేరి` రీమేక్ లో ర‌వితేజ‌ నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అది వర్కౌట్‌ కాలేదు. కానీ తన నెక్ట్స్ రీమేక్ అనే తెలుస్తోంది. ఇటీవల రిలీజైన `డిస్కోరాజా` అంత‌కుముందు నేల టికెట్టు- టచ్‌ చేసి చూడు-అమర్‌ అక్బర్‌ ఆంటోనీ ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ రవితేజకి నాలుగు ఫ్లాప్ లు ప‌డిపోయాయి. వరుస పరాజయాలతో తన మార్కెట్ .. ఇమేజ్‌ పడిపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు మాస్‌ మహారాజా రవితేజ.

ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'క్రాక్‌' చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్ కాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. రవితేజ- గోపీచంద్‌ కాంబినేషన్‌లో 'బలుపు-డాన్‌ శీనుస త‌ర్వాత ఇది మూడో చిత్రం. గ‌త‌ రెండు సినిమాలు యావ‌రేజ్ ఫలితాలను సాధించినా కమర్షియల్ గా ఓకే అనిపించాయి. దీంతో ఈసారి హిట్‌ కోసం మూడోసారి 'క్రాక్‌' చిత్రం చేస్తున్నారు. ఇది సమ్మర్‌ స్పెషల్ గా మే 8న విడుదల కానుంది. దీంతోపాటు రమేష్‌ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కోనేరు సత్య నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కూడా ఓ రీమేక్‌ అని తెలుస్తోంది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'శతురంగ వెట్టై 2'ని తెలుగులో రవితేజ హీరోగా రమేష్‌ వర్మ రీమేక్‌ చేయబోతున్నారట. తనకు వరుస ఫ్లాప్ లున్న నేపథ్యంలో సేఫ్‌ జోన్ లో ఉండేందుకు రవితేజ కూడా ఈ నమ్ముకుంటున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు రమేష్‌ వర్మ గతేడాది 'రాక్షసుడు'తో విజయాన్ని అందుకున్నారు. ఇది కూడా ఓ త‌మిళ‌ రీమేక్‌ అన్న విషయం తెలిసిందే.