Begin typing your search above and press return to search.

రీషూట్ దారిలో రాజా!!

By:  Tupaki Desk   |   23 Sep 2017 5:06 AM GMT
రీషూట్ దారిలో రాజా!!
X
షూటింగ్ పూర్తి చేసేసుకుని.. విడుదలకి రెడీ అయిపోయి.. రిలీజ్ డేట్ గురించి ఇన్ ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత.. ఓ సినిమాకు రీషూట్స్ చేయడం అంటే.. గతంలో అదో బ్యాడ్ న్యూస్ మాదిరిగా ఉండేది. సినిమా బాలేదని.. అందుకే రీషూట్స్ చేస్తున్నారని అనుకునేవారు. కానీ ఇప్పుడు మేకర్స్ దృక్పథంలోను.. వ్యూయర్స్ ఆలోచనలోనూ మార్పులు వచ్చాయి.

ఓ మూవీని మరింత పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దేందుకు రీషూట్స్ ఉపయోగపడతాయనే విషయాన్ని అందరూ బాగానే అర్ధం చేసుకుంటున్నారు. అందుకే రీషూట్స్ చేయాల్సి వస్తే ఆ విషయాన్ని బైటకు కూడా చెబుతున్నారు. రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్ మూవీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉందని తెలుస్తోంది. దీపావళికి రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేసిన ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా పూర్తికాగా.. ఇప్పుడు ఫైనల్ కాపీ కూడా చేతికి వచ్చేసిందట. చిత్రాన్ని ఆసాంతం తిలకించిన నిర్మాత దిల్ రాజు.. ఫైనల్ ఔట్ పుట్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ మొత్తం పూర్తిగా ఎంజాయ్ మెంట్ యాంగిల్ లో ఉండగా.. సెకండాఫ్ విషయంలో సంతృప్తి చెందలేదట దిల్ రాజు.

రాజా ది గ్రేట్ లో రవితేజ అంధుడి పాత్రలో నటిస్తుండగా.. కామెడీ బేస్డ్ గా సాగే ప్రథమార్ధం బాగానే ఉన్నా.. ద్వితీయార్ధం విషయానికి వచ్చేసరికి సాధారణ వ్యక్తి మాదిరిగానే ప్రవర్తించడాన్ని ప్రస్తావించాడట దిల్ రాజు. కొన్ని సీన్స్ రీషూట్ చేయకపోతే.. ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వస్తుందన్న నిర్మాత సూచనల కారణంగా.. ఆయా సన్నివేశాల రీ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే దీపావళి రిలీజ్ డెడ్ లైన్ వాయిదా వేసుకునేందుకు కూడా దిల్ రాజు సిద్ధమయినట్లు టాక్.