Begin typing your search above and press return to search.
తేడా కొడుతోంది రాజా
By: Tupaki Desk | 20 Oct 2017 11:47 AM GMTబాక్స్ ఆఫీస్ దగ్గర వేరే ఏ తెలుగు సినిమా పోటీ లేకుండా బరిలో దిగిన రాజా ది గ్రేట్ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ వరకు డీసెంట్ గానే తెచ్చుకుంది కాని అసలు స్టొరీ రెండో రోజు నుంచి మొదలైనట్టు కనిపిస్తోంది. ఓవర్సీస్ లో రవితేజ మార్కెట్ మరీ స్ట్రాంగ్ గా లేనప్పటికీ తన ఎనర్జీ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడనే ఒపీనియన్ అక్కడ ఎప్పటి నుంచో ఉంది. యఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ బలపడే సమయానికి రవితేజ సినిమాల పరంగా సక్సెస్ రేట్ డౌన్ లో ఉంది. అందుకే దాదాపు రెండేళ్ళు తన సినిమా లేకుండా సైలెంట్ గా ఉన్న మాస్ మహారాజా రాజా ది గ్రేట్ తో లాంగ్ గ్యాప్ తర్వాత పలకరించాడు. మొదటి రోజు తన రేంజ్ కు తగ్గట్టు బాగానే రాబట్టుకున్న రాజా ది గ్రేట్ సెకండ్ డే నుంచి మాత్రం యుఎస్ లో అంత ఆశాజనకంగా రన్ కావడం లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. హీరో గుడ్డివాడిగా సినిమా మొత్తం ఉండటం అనే పాయింట్ మినహాయించి మిగిలినదంతా రొటీన్ కమర్షియల్ వ్యవహారమే కావడంతో అక్కడి ఆడియన్స్ టేస్ట్ కి ఇది మ్యాచ్ కాక కలెక్షన్ డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోందని అక్కడి ట్రేడ్ టాక్ బయటికి వచ్చింది.
ఫోర్సుగా ఇరికించిన కామెడీ - ఏ మాత్రం ఊపునిచ్చేలా లేని పాటలు - లెంగ్త్ మరీ సాగదీసినట్టు అనిపించడం తదితర కారణాల వల్ల టాక్ కూడా పాజిటివ్ నుంచి డివైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఈ లెక్కన వీక్ ఎండ్ దాటే లోపు హాఫ్ మిలియన్ మార్క్ దాటడం కూడా కష్టమే. ఒకవేళ అదే జరిగితే దిల్ రాజు బ్యానర్ - రవితేజ ఇమేజ్ ని చూసి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టం ఖాయమే. తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ సెలవుల ప్రభావం వల్ల డీసెంట్ గా రన్ అవుతున్న రాజా ది గ్రేట్ ప్రమోషన్ విషయంలో దిల్ రాజు యూనిట్ అలసత్వం ప్రదర్శించడంతో వారాంతం పూర్తి కాగానే డ్రాప్ ఖచ్చితంగా వచ్చే సూచనలు ఉన్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో రాజు గారి గది 2 మొదటి మూడు రోజులు కాస్త స్లో అనిపించినా తర్వాత పికప్ కావడం విశేషం. నాగార్జున గతంలో ఎన్నడు చేయని రోల్ చేయటం, సమంత ఆత్మగా టెర్రిఫిక్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం - తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తదితర కారణాలు దానికి అనుకూలంగా మారుతున్నాయి. తనకు కం బ్యాక్ మూవీగా గ్రాండ్ సక్సెస్ తో పలకరించి ఫాంలో నిలబెడుతుంది అని రవితేజ పెట్టుకున్న ఆశలు పూర్తిగా నెరవేరేలా అయితే లేవు. హీరోకి కళ్ళు లేకుండా చూపించి మిగిలింది ఎంత రొటీన్ గా తీసినా పర్వాలేదు అనుకున్న అనిల్ రావిపూడి - దిల్ రాజు లెక్కలు తప్పినట్టే ఉంది పరిస్థితి. ఈ వీక్ ఎండ్ అయ్యాక దీని గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.