Begin typing your search above and press return to search.

రాజా.. అక్కడిది గ్రేట్ కాదయ్యా!!

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:28 PM GMT
రాజా.. అక్కడిది గ్రేట్ కాదయ్యా!!
X

ఇప్పుడు అందరూ కూడా ఓవర్సీస్ లో తొలి వారంలోనే వీలైనంత లాగేయాలని చూస్తున్న రోజులివి. ఎందుకంటే అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా వీకెండ్ మిస్సయితే అసలు రికవరీ చేయడానికి పెద్దగా అవకాశాలు అనేవే ఉండవు. అందుకే ఇప్పుడు రాజా ది గ్రేట్ కూడా తొలి వీకెండ్లోనే మ్యాజిక్ ఏదైనా చేస్తుందని అనుకుంటే.. నిమ్మకునీరెత్తినట్లుగా చేసిన ప్రమోషన్లు సినిమాలకు ప్లస్ కాలేదని ప్రాక్టికల్ గా కనిపిస్తోంది.

మంగళవారం ప్రీమియర్ల కలక్షన్లతోన 135000 డాలర్లు వసూలు చేసిన రాజా ది గ్రేట్ సినిమా.. ఆ తరువాత మాత్రం కాస్త స్లో అయిపోయింది. మొత్తంగా సినిమా బుధవారం గురువారంలలో వచ్చిన కలక్షన్లను కలుపకుని 197000 డాలర్లు వసూలు చేసిందంతే. అంటే షుమారు 1.4 కోట్లు గ్రాస్ వచ్చినట్లు. అసలు మొత్తంగా 1.75 కోట్లకు ఓవర్సీస్ రైట్లు కొనుకున్న పంపిణీదారులు.. ఇప్పుడు రికవర్ అవ్వాలంటే శుక్రవారం నుండి సినిమా పుంజుకుని ఒక 3 కోట్ల రూపాయల షుమారు వసూలు చేస్తే కాని అంత షేర్ వసూలు చేయడం కష్టం. అట దాదాపు 400000 డాలర్లు రావాలి. ఈ 400K వసూలు చేయడం ఇప్పుడు గ్రేట్ రాజా వలన అవుతుందా?

అదేంటి సినిమాలో తొలిసారిగా హీరో ఒక బ్లయిండ్ పాత్రను చేశాడు కదా.. ఓవర్సీస్ ప్రేక్షకులు ఆ మాత్రం సినిమాను చూడరా? అలా అనుకుంటే తప్పే. ఎందుకంటే కేవలం హీరోకు కళ్ళు లేకపోయినా కూడా ఇక్కడ ట్రైన్లు ఎక్కేస్తాడు ఫైట్లు చేసేస్తాడు వంద మంది విలన్లను తుక్కు తుక్కుగా కొట్టేస్తాడు. పైకి ఏదో ప్రయోగంలా అనిపించి లోపల మాత్రం ఊర మాస్ సినిమా తీస్తే.. ఎన్నారైలు పెద్దగా కనక్ట్ అయినట్లు లేరు. అది సంగతి.