Begin typing your search above and press return to search.
తగ్గినా రవితేజ అక్కడ కవర్ చేస్తాడులే
By: Tupaki Desk | 13 Feb 2017 7:58 AM GMTరవితేజ ఏడాదికి పైగా ఏ సినిమాను చేయకుండా.. రీసెంట్ గా రెండు కొత్త సినిమాలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో మాస్ మహరాజ్ చేస్తున్నాడంటూ ఓ నాలుగైదు ప్రాజెక్టుల పేర్లు వినిపించినా.. అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. దీనికి అసలు కారణం రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడమే అనే టాక్ బాగానే నడిచింది.8-9 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేశాడనే టాక్ ఉంది.
ఇప్పుడు రవితేజ ఈ విషయంలో ఓ మెట్టు దిగడంతోనే కొత్త సినిమాలు చకచకా మొదలైపోయాయనే టాక్ ఉంది. అయితే.. ఓ యాంగిల్ లో తగ్గినా.. మరో యాంగిల్ లో రాబట్టుకునే అవకాశం ఉండడంతోనే ఇక్కడ డీల్ సెట్ అయిందట. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రూ. 5 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట మాస్ మహరాజ్. అయితే.. సినిమా బిజినెస్ కంప్లీట్ అయ్యాక.. రిలీజ్ తర్వాత.. వచ్చిన లాభాల్లో 20శాతం షేరింగ్ ఇస్తామనే ప్రపోజల్ పెట్టారట దర్శక నిర్మాతలు.
ఈ ప్రతిపాదన రవితేజకు నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేసిందని అంటున్నారు. ఇక్కడ తగ్గినా అక్కడ కవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనే లెక్కలు వేసుకున్నాడట రవితేజ. సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా ఉండే.. మాస్ మహరాజ్ కు భారీగానే ముట్టడం ఖాయం.