Begin typing your search above and press return to search.
మీటూ దెబ్బకు భయపడిన రాజా!
By: Tupaki Desk | 14 Nov 2018 7:02 AM GMTప్రపంచం మొత్తం మీటూ ఉద్యమం గురించి మాట్లాడుకుంటోంది. హాలీవుడ్ కకావికలం అయ్యింది. బాలీవుడ్ షేకైపోయింది. కార్పొరెట్ గడగడలాడింది. అన్నిచోట్లా పెద్దోళ్ల పదవులు ఊడాయి. సినీరంగంలో పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటికి పంపేశాయి. అసలేమవుతుందో అర్థం కాని సన్నివేశం నెలకొంది. బాలీవుడ్ లో వచ్చిన ఈ ఊపు చూసి ఇక టాలీవుడ్ పనైపోయినట్టేనని అనుకున్నారంతా. ఇక్కడ మీటూ దెబ్బకు పెద్ద పెద్ద సొరచేపలు వల్లో చిక్కుతాయని - కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చేస్తాయని స్పెక్యులేషన్స్ రన్ అయ్యింది.
కానీ టాలీవుడ్ సీన్ పూర్తి రివర్సులో ఉంది. ఎవరో శ్రీరెడ్డి - మాధవీలత లాంటి నటీమణులు మినహా ఎవరూ పెద్దంతగా పెదవి విప్పలేదు. మనసు విప్పి మీటూ వేదికపైకి వచ్చి ఏ స్టార్ హీరోయిన్ మాట్లాడకపోవడంతో అంతా బతికిపోయారు. సమంత-నందినిరెడ్డి-లక్ష్మి మంచు- యాంకర్ ఝాన్సీ లాంటి యాక్టివ్ ర్యాపిడ్ ఫోర్స్ మీటూ- అబల పేరుతో సంఘం స్థాపించినా ఎవరూ చెప్పుకునేందుకు మాత్రం ముందుకు రాలేదు. మొత్తానికి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం చప్పబడిపోయింది. ఆ గొడవలో ఎవరూ బయటకు రాకుండా ఉద్యమాన్ని తొక్కేశారన్న మాటా వినిపిస్తోంది. ఇక మూవీ ఆర్టిస్టుల సంఘం సైతం శ్రీరెడ్డి వివాదం తర్వాత అప్పట్లో కాస్టింగ్ కౌచ్ నివారణకు ఏర్పాటు చేసిన `కాష్` కమిటీ యాక్టివ్ గానే ఉంది. ఏదైనా ఉంటే పెద్దలకు చెప్పుకుని ఆ తర్వాత బయటపడండి అని కండిషన్ పెట్టడంతో ఎవరూ ఇక బయటికి రాలేకపోయారు.
అయితే మీటూ ప్రభావం ఎలా ఉంది? అంటే ఓ రేంజులో ఉందని పలువురు ప్రొడక్షన్ మేనేజర్ లు వాపోయిన సందర్భం ఉంది. లేడీ ఆర్టిస్టుతో మాట్లాడాలంటేనే భయపడిపోతున్నామని చెబుతున్నారు మేనేజర్స్. సీనియర్ నటుడు మురళి మోహన్ అంతటి వారే ఈ ఉద్యమం వల్ల అనవసర అల్లరి జరుగుతోంది. మీటూ అంటేనే భయం కలుగుతోందని చాంబర్ లో జరిగిన ఓ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మీటూ ప్రభావంపై మాస్ మహారాజా రవితేజ కూడా స్పందించారు . హైదరాబాద్ లో జరిగిన అమర్ అక్బర్ ఆంటోని ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ.. మీటూ దెబ్బకు అంతా భయపడ్డారు. మంచిదే.. ఇప్పుడు అంతా మంచిగా ఉంది. బావుంది.. ఇలాగే ఉండాలి.. అని తనదైన స్టైల్లో అన్నారు రాజా.